Site icon NTV Telugu

Delhi: జమిలి ఎన్నికల కమిటీ భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Covind

Covind

జమిలి ఎన్నికలపై (One Nation One Election) ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Former President Ram Nath Kovind) ఆధ్వర్యంలో భేటీ అయింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే పాల్గొన్నారు. జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డిఎన్‌ పటేల్‌తో కూడా కమిటీ సంప్రదింపులు జరిపింది.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, N. K. సింగ్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ సి. కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాలు మరియు పురోగతిపై సమీక్షించారు.

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ మరియు మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రాతో కూడా కమిటీ సంప్రదింపులు జరిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కానీ జమిలి ఎన్నికలు మాత్రం ఇప్పటిలో సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది. భవిష్యత్‌ ప్రణాళికపై ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా ఆయా రాజకీయ ప్రముఖులు, న్యాయమూర్తుల అభిప్రాయాలను కమిటీ సేకరిస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్రానికి ఎలాంటి నివేదిక అందజేస్తుందో వేచి చూడాలి.

 

Exit mobile version