Site icon NTV Telugu

ndustrial Safety: పారిశ్రామిక ప్రమాదాల నివారణ సూచనలకు హైలెవెల్ కమిటీ

Industrial Safety

Industrial Safety

Industrial Safety: పారిశ్రామిక ప్రమాదాల నివారణ సూచనలకు హైలెవెల్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్మాగారాలలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు చర్యలను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కమిటీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా నేతృత్వం వహిస్తారు. నేడు జిల్లాలో కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. కర్మాగారాల్లో పారిశ్రామిక భద్రత మెరుగుదలకు సంబంధించి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్ల నుంచి సూచనలు స్వీకరించారు.

Read Also: Minister Satya Kumara Yadav: స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్యాంధ్రప్రదేశ్ కీల‌కం.. గుర్లలో డయేరియా ప్రబలడంపై మంత్రి సమీక్ష

ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి మౌలిక సదుపాయాలు, మానవ వనరుల పరంగా నియంత్రణ సంస్థలను బలోపేతం చేయాలన్నారు. భద్రతా శిక్షణా ప్రోటోకాల్‌లను బలోపేతం చేయడం, తనిఖీ విధానాల సవరణ, సేఫ్టీ ఆడిట్ సిస్టమ్‌లు, భద్రతా రేటింగ్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టడంపై ప్రస్తుత చట్టాలను సవరణలు చేయాలన్నారు. వివరణాత్మక అధ్యయనాలు, సిఫార్సులను చేయడానికి కమిటీకి నివేదికల సమర్పణ కోసం వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమల కమిషనర్ ప్రతిపాదించిన ప్రకారం, కమిటీ పనిలో భాగస్వామ్యం కోసం NIDM, NDRF, ILO మొదలైన జాతీయ స్థాయి సంస్థలతో సమావేశం కానున్నారు. పారిశ్రామిక భద్రతను మెరుగుపరిచేందుకు ఏవైనా సూచనలు ఉంటే వాటిని “aphighlevelcommitee@gmail.com” అనే మెయిల్‌కు ఇమెయిల్ చేయాలని కమిటీ ఛైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా తెలిపారు.

Exit mobile version