Site icon NTV Telugu

High Court: మెట్రోలో బెట్టింగ్ ప్రమోషన్స్.. మెట్రోరైలు ఎండీకి హైకోర్టు నోటీసులు

High Court

High Court

మెట్రో రైలు లో బెట్టింగ్ ప్రమోషన్ ఫై హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో రైల్లో బెట్టింగ్ ఆప్ ప్రమోషన్‌పై హైకోర్టులో పిల్ దాఖలైంది. అడ్వకేట్ నాగూర్ బాబు ఈ పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్స్ పై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని అందులో పేర్కొన్నారు. రోజుకి 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో ఐఏఎస్, ఐపీఎస్ లు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.

READ MORE: TTD: శ్రీవారి దర్శన టికెట్లకు ఫుల్‌ డిమాండ్‌.. నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తి..!

హెచ్‌ఎంఆర్‌ఎల్ (HMRL) లేదా అనుబంధ సంస్థలు ఇల్లిగల్ బెట్టింగ్ అప్ ప్రమోట్ చేయడానికి ఎన్నికోట్ల ముడుపులు తీసుకొన్నారో ఈడీ దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరారు.. తెలంగాణ గేమింగ్ అమండమెంట్ యాక్ట్ 2017, అమల్లో ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.. పిటిషన్‌పై విచారించి హైకోర్టు మెట్రో రైలు ఎండీకి నోటీసులు జారీ చేసింది.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతి వాదులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

READ MORE: Delhi: సాయంత్రం 6గంటలకు అఖిలపక్ష భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Exit mobile version