Site icon NTV Telugu

TSRTC : టీఎస్‌ఆర్టీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Tsrtc

Tsrtc

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ఎన్నికలు జరగలేదని ఎంప్లాయీస్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. వారి వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అయితే.. గతంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీలో యూనియన్‌ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ తరఫున ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎ.కె.జయప్రకాశ్‌రావు వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రిటర్నింగ్‌ అధికారిని నియమించినా ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తూ వస్తున్నారని కోర్టుకు తెలిపారు.

Also Read : CM YS Jagan: రైతులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌..

రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. గత పాలకవర్గం గడువు ముగిసినా కార్మికశాఖ 2018 నుంచి ఎన్నికలు నిర్వహించడంలేదని పటిషనర్‌ తరుఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఆర్టీసీలో 48 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, తమ యూనియన్‌ పలు ఎన్నికల్లో గెలిచి గుర్తింపు సాధించిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 24కు వాయిదా వేసింది. దీంతో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు టీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ తీర్పు నిచ్చింది.

Also Read : JC Diwakar Reddy: జేసీ సంచలనం.. సీమను తెలంగాణలో కలపాల్సిందే..!

Exit mobile version