ఉపాధ్యాయుల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సవరించింది. టీచర్ యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లను హైకోర్టు తప్పుపట్టింది. టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్ల కేటాయించడానికి హైకోర్టు అనుమతించింది. భార్యభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని తెలిపింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పిటిషనర్ల తరపున చిక్కుడు ప్రభాకర్, కృష్ణయ్య వాదనలు వినిపించాగా.. ప్రభుత్వం తరపున అదనపు ఏజీ రామచంద్రరావు కోర్టులో వాదనలు వినిపించారు.