High Alert in Vijayawada: బెజవాడలో హై అలర్ట్.. 144 సెక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంతిభద్రతల నేపథ్యంలో బెజవాడలో హై అలెర్ట్ విధించారు పోలీసులు. సీపీఎస్ రద్దుని కోరుతూ ఛలో సీఎంఓకు యూటీఎఫ్ పిలుపివ్వడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. విజయవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో భారీగా మొహరించారు పోలీసులు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు విధులలో వున్నారు. సర్వీస్ నుంచి నేషనల్ హైవే మీదకి రాకుండా మధ్యలో ఫెన్సింగ్.. ముళ్ల కంచెలతో భద్రత ఏర్పాటుచేశారు. పొట్టిపాడు, దావులూరు, కాజా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు.

Cps Police
ఉద్యోగ, ఉపాధ్యాయుల బైక్ ర్యాలీలను అడ్డుకుంటున్నారు పోలీసులు. రైలు, రోడ్డు మార్గాన ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ, గుంటూరులకు చేరుకోకుండా స్టేషన్‌లు, బస్‌స్టాండ్‌ల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. విజయవాడ, గుంటూరులలో పోలీసుల నిఘాలో రైల్వే స్టేషన్‌లు, బస్ స్టాండ్‌లు వున్నాయి.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ఐడీ కార్డులు.. సెల్ ఫోన్లు తనిఖీలు చేసి మరీ వదులుతున్నారు పోలీసులు. దావులూరు చెక్ పోస్ట్ వద్ద 27 మందిని.. తుమ్మలపల్లి కళా క్షేత్రం వద్ద మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, ప్రకాశం బ్యారేజీ, వారధి, సీఎం నివాసం వద్జ పెద్ద ఎత్తున పోలీసుల మొహరించారు.
కంకిపాడు మండలం దావులూరు టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలు. ఉపాధ్యాయులు చేపట్టిన సీఎంఓ ముట్టడి నేపథ్యంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్నవారిని స్టేషన్‌కి తరలించారు. యూటీఎఫ్ నిరసనకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
మరో వైపు సిఎం ఇంటి ముట్టడి కి అనుమతి లేదని, అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం అన్నారు గుంటూరు ఎస్పీ ఆరిఫ్. చట్టాన్ని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు