Site icon NTV Telugu

The Virus Warning: షావోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్ల యూజర్స్ కి హై అలర్ట్

Phone

Phone

ప్రస్తుతం ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఉదయం లేవగానే బ్రెస్ కంటే మొదట ఫోన్ ను పట్టుకుంటున్నాం. కాని షావోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్లు వాడుతున్న వారికి ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. షావోమీ, రెడ్ మీ, పోకో ఫోన్ల తోపాటు పాటు ఈ కంపెనీకి చెందిన రెడ్‌మీ, పోకో స్మార్ట్‌ఫోన్‌లలో ప్రమాదకర వైరస్‌ను సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వైరస్‌ వల్ల వినియోగదారుల వ్యక్తిగత డాటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫోన్‌లలో ఏప్రిల్‌ 25 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య దాదాపు 20 భద్రతాపరమైన లోపాలు, సమస్యలను సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. వ్యక్తిగత డాటా భద్రతకు ముప్పు పొంచి ఉందంటున్నారు.

READ MORE: Murder: భార్య, కుమార్తెను చంపేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త.. విషమ పరిస్థితులలో కొడుకు..

షావోమీ ఫోన్‌లతో పాటు ఈ కంపెనీకి చెందిన రెడ్‌మీ, పోకో స్మార్ట్‌ఫోన్‌లలో ప్రమాదకర వైరస్‌ను సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వైరస్‌ వల్ల వినియోగదారుల వ్యక్తిగత డాటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫోన్‌లలో ఏప్రిల్‌ 25 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య దాదాపు 20 భద్రతాపరమైన లోపాలు, సమస్యలను సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వివరాలను ఓవర్‌సెక్యూర్డ్‌ అనే బ్లాగ్‌లో ప్రచురించారు. ఎంఐయూఐ, హైపర్‌ఓఎస్‌ వినియోగించే ఫోన్‌లలో ఈ సమస్యలు ఉన్నట్టు పేర్కొన్నారు. షావోమీ ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్ట్‌ యాప్‌(ఏఓఎస్‌పీ)లలో లోపాలు ఉన్నాయని, వీటిని వెంటనే సరిచేయాలని తెలిపారు. ఈ భద్రతాపరమైన లోపాల గురించి చైనాకు చెందిన షావోమీ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కాని వినియోగదారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి.

Exit mobile version