Site icon NTV Telugu

Cyber Crime: హైదరాబాద్ లో హైటెక్ మోసాలు.. సైబర్ నేరాల పట్ల జర ఫైలం

Cyber Crime

Cyber Crime

టెక్నాలజీ అనేది మన రోజు వారి జీవితంలో భాగమైంది. దీని వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అంతకు రెట్టింపు నష్టాలు కూడా ఉన్నాయి. ఈ డిజిటల్‌ ప్రపంచంలో.. సైబర్‌ స్టాకింగ్‌, సైబర్‌ దోపిడి, సైబర్‌ బెదిరింపు, సైబర్‌సెక్స్‌ ట్రాఫికింగ్‌ వంటి అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదొక మయ ప్రపంచం.. ఆన్‌లైన్‌ మోసాలు, నేరాలు, వేధింపులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే జీవితాలు ప్రమాదంలో పడే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఎక్కడో ఓ చోట ఆన్ లైన్ మోసాలు జరుగుతునే ఉన్నాయి.

Read Also: Credit Cards: క్రెడిట్ కార్డుతో అవి కొనాలనుకుంటే.. 300%పన్ను కట్టాల్సిందే

తాజాగా ఈజీ మనీ సంపాదించుకోవచ్చనే ఆశ చూపిస్తూ.. హైదరాబాద్‌ కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.87లక్షలను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. హైదరాబాద్ నగరంలోని సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అస్మాబాద్‌ కు చెందిన ఓ వ్యక్తికి ఆన్‌లైన్‌లో రాండీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనని తాను ఆస్ట్రేలియా కంపెనీ హైపర్‌వర్త్‌ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే.. అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పాడు. అతడి నుంచి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టించాడు.

Read Also: Amazon Prime Day Sale 2023: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. ఈ కార్డులపై 10 శాతం డిస్కౌంట్!

మొదట్లో లాభాలు ఇస్తూ నమ్మకం కలిగేలా సదరు సైబర్ నేరగాడు.. ఈ క్రమంలో ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే.. ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని నమ్మించాడు.. దీంతో ఆ బాధితుడు ఏకంగా రూ.50లక్షలు ఒక్కసారిగా పెట్టుబడి పెట్టాడు. ఇదే సమయంలో మరో బాధితుడికి మయాంక్‌ అనే వ్యక్తి పరిచయమ్యాడు. ఆ వ్యక్తికి కూడా ఇదే తరహాలో లాభాలను చూపాడు. అతడిని కూడా నమ్మించి.. రూ.12 లక్షలను పెట్టుబడిగా పెట్టించుకున్నాడు. వారు పెట్టుబడి పెట్టిన మరుక్షణం నుంచి ఇటు రాండీ గానీ, అటు మయాంక్‌ గానీ స్పందించలేదు. దీంతో తాము మోసపోయానని గ్రహించిన బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Exit mobile version