Hi Nanna : థర్డ్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్ చేసిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని తన తరువాత సినిమాను కొత్త దర్శకుడి తో చేస్తున్నాడు. నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీ తన కెరీర్ లో 30 వ మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్ మరియు సెకండ్ సింగిల్‌లను లాంఛ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ అమ్మాడి సాంగ్‌ను నవంబర్ 04న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఈ సాంగ్‌పై చిత్రబృందం మరో అప్‌డేట్ ను ఇచ్చింది. ఈ సాంగ్‌ను రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS)లో లాంచ్ చేయనున్నట్లు గా తెలిపింది.
ఇక గురువారం ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయగా.. ‘ప్రాణం అల్లాడి పొద అమ్మాడి’ అంటూ సాగిన ఈ ప్రోమోలో నానిని, మృణాల్ టచ్ చేస్తున్న స్టిల్ చాలా ఎంతో అందంగా ఉంది. ఈ జోడీ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మాత్రమే కాకుండా అందమైన ప్రేమ జంట మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలైట్ కాబోతున్నాయని సమాచారం… నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో కాంబినేషన్ పరంగా కూడా సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.ఇక ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మలయాళ కంపోజర్ హెషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
- MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
- IMD Monsoon Forecast: రైతన్నలకు చేదు వార్త.. ఆగస్టు, సెప్టెంబర్లలో తగ్గనున్న వర్షాలు..
- Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
- Tags
- #Hi Nanna
- Mrunal Thakur
- Nani
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
-
August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
-
MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!