Hi Nanna : ‘హాయ్ నాన్న’పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన నాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ..ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తండ్రీ, కూతురు సెంటిమెంట్ తో వస్తోన్న ఈ సినిమా కు డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించారు. ఇందులో కియారా ఖన్నా నాని కూతురిగా నటించింది.ఈ సినిమా ఈ డిసెంబర్ 7న తెలుగుతోపాటు హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.. ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన సాంగ్స్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ లో ఎలక్షన్స్ జరగనున్నాయి.రీసెంట్ గా నాని పొలిటికల్ గెటప్ లో కనిపించి హాయ్ నాన్న సినిమాకు సంబందించి వినూత్నంగా ప్రచారం చేసాడు..తాజాగా సినిమా రిలీజ్ దగ్గర్లో వుంది.. ఎలక్షన్స్ మధ్యలో వున్నాయి..రెండింటిని వాడేయడమే అంటున్నారు న్యాచురల్ స్టార్ నాని. మేనిఫెస్టోలు అంటే నోటికొచ్చింది చెప్పేస్తున్నారు అందరూ నేనూ ఒక రాయి ఏసా.. మీ ఓటు హాయ్ నాన్నకే అంటూ ఫన్నీ వీడియో ను షేర్ చేశారు నాని. ప్రమోషన్స్ కోసం సరికొత్తగా ట్రై చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నాని. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ జోరు కొనసాగుతుంటే.. పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ తమ మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడిని తన ప్రచారానికి వాడేస్తున్నారు నాని. రాజకీయ నాయకుడిగా మారి హాయ్ నాన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
ఇందులో యూత్ పై వరుసగా వరాలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది..’మన పార్టీ హాయ్ నాన్న.. అధికారంలోకి వస్తే.. యూత్ అందరికీ విచ్చలవిడిగా రీల్స్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్స్ మరియు లైటింగ్ సెటప్ కిట్స్ పంచిపెడతాము. అందరి ఆదాయం పెరిగేలా మేము చూస్తాం. థియేటర్లది.. అలాగే పక్కనే ఉండే కిరాణ కొట్టుల ఆదాయం అలాగే టాపిక్ తెలియకుండా అదే పట్టుకుని వేలాడుతూ ఇష్టమొచ్చినట్లు వాగే వాళ్ల ఆదాయం పెరిగేలా చూస్తాం. నన్ను గనక పదవిలో కూర్చోబెడితే.. ప్రతి జంక్షన్లో కూడా నా బొమ్మ ఉండేలా చూస్తాను.. అలాగే ప్రతి థియేటర్లో మా హాయ్ నాన్న ఉండేలా నేను చూస్తాను. అలాగే వరల్డ్ కప్ క్రికెట్ టికెట్ పై డిస్కౌంట్ ఇస్తాం’ అని తెలిపాడు.. దీంతో ఓ వ్యక్తి వరల్డ్ కప్ అయిపోయింది సర్ అని చెప్పడంతో వచ్చే వరల్డ్ కప్.. చెప్తాం కానీ ఇవ్వక్కర్లేదు కదా అంటూ సెటైర్ వేశాడు నాని.అలాగే ‘మీ ఫేవరెట్ పార్టీ అయినా హాయ్ నాన్నను గెలిపించుకోవడానికి.. హాయ్ నాన్న అంటే తండ్రి, కూతురికి మధ్య అనుబంధం గుర్తొస్తుంది. అందుకే ప్రతి తండ్రికి, కూతురు రెండువైపుల ఉండేలా మేము చూసుకుంటాం. ఒకరికి రెండు ఓట్లు ఉండేలా చూసుకుంటున్నాం వన్ ప్లస్ వన్ ఆఫర్. ఓట్లు అంటే 18 ఏళ్లు దాటిన వారే వేయ్యాలి. కానీ హాయ్ నాన్న చిత్రానికి చిన్న, పెద్ద ఇద్దరూ ఓటు వేయొచ్చు. ముందస్తు ఎన్నికలు తరతరాలుగా వస్తుంది. అందుకే ఒకరోజు ముందుగానే హాయ్ నాన్న వస్తుంది.’ అంటూ చెప్పుకొచ్చాడు. నాని షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read
- OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్‌తో రచ్చ!
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Off The Record: నెల్లూరు టీడీపీ పాత నేతలకు షాకుల మీద షాకులు
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
తాజావార్తలు
-
OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్‌తో రచ్చ!
-
Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
-
Off The Record: నెల్లూరు టీడీపీ పాత నేతలకు షాకుల మీద షాకులు
-
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
-
Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!