NTV Telugu Site icon

Israel–Hezbollah conflict: హిజ్బుల్లా ఉగ్ర స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి

Hezbollah

Hezbollah

హమాస్‌పై యుద్ధంతో ఇరాన్ మద్దతు గల సంస్థ హిజ్బుల్లా సోమవారం నాడు అర్థరాత్రి ఇజ్రాయెల్‌పై 35 రాకెట్లతో దాడి చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు హిజ్బుల్లా పేర్కొంది. లెబనాన్‌కు చెందిన కత్యుషా రాకెట్లు ఇజ్రాయెల్‌లోని సఫేద్ నగరంలో పడిపోయాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) తెలిపింది. అయితే, ఈ దాడిలో ఇజ్రాయెల్‌లో 10 మంది సైనికులు, 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్‌లోని రాకెట్ లాంచింగ్ సైట్‌పై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది.

Read Also: Deadpool Wolverine: పిచ్చెక్కించే విజువల్స్ తో ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ ట్రైలర్

కాగా, లెబనాన్ లోని గ్రామాలపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగిందని లెబనాన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ (NNA) తెలిపింది. అయితే, ఇజ్రాయెల్ ఇటీవల లెబనాన్‌లోని షరీఫా, ఒడాస్సే, రబ్ లాటిన్ గ్రామాలలో హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించింది. ఇక, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం.. హమాస్‌పై యుద్ధం ప్రారంభమైన తర్వాత హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై నిరంతరం దాడి చేస్తోందని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలో ఇప్పటి వరకు 376 మంది హిజ్బుల్లా యోధులు మరణించారు అని వెల్లడించింది.