బద్రికి సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2000 లో విడుదలై ఘనవిజయం సాధించింది. అయితే… ఈ సినిమాలో “హే చికితా” అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో సంచలన సృష్టించిన ఈ పాట ఇప్పుడు ప్లే చేసినా.. స్టెప్పులేయాల్సిందే.. కాగా.. ఇప్పుడు “హే చికితా” సినిమా రూపంలో వస్తోంది. పవన్ కళ్యాణ్ పాట అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్స్ ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ ,’గరుడవేగ’ అంజి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “హే చికితా”. ధన్‌రాజ్ లెక్కల రచన, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ని డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు. అనుసూయ భరద్వాజ్, సాయి రాజేష్ ,వశిష్ట ఎన్ సింహ సోషల్ మీడియా వేదికగా రివిల్ చేశారు.
READ MORE: AICC: కాంగ్రెస్ ఇంచార్జిగా దీపా దాస్ అవుట్.. పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను ప్రకటించిన ఏఐసీసీ
ఈ రోజు నుంచే సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. అందరికీ వాలెంటైన్స్ డే విషెష్ తెలుపుతూ ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైయింది. తెలంగాణ, ఆంద్రాలోని పలు అద్భుతమైన లొకేషన్ లో శర వేగంగా షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ చిత్రం లో వైఫ్ ఆఫ్ ఫేమ్ అబినవ్ మణికంట, దివిజ ప్రభాకర్, తన్మయి హీరో, హీరోయిన్లగా నటిస్తుండగా, 30 ఇయర్స్ పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత, సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలో మై విలేజ్ షో అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ నటిస్తున్నారు.
READ MORE: Bhagwant Mann: అమెరికా విమానం అమృత్‌సర్‌కి రావడంపై పంజాబ్ సీఎం ఆగ్రహం