Flying car: ఎగిరే కారు వచ్చేసిందోచ్.. విశేషాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. ఇక వర్షం పడితే అంతే సంగతులు.. అక్కడే ఉండిపోవాల్సందే. అలాంటప్పుడు అనిపిస్తుంది. గాల్లో ఎగిరిపోతే బాగుండు అని.. ఇప్పుడు ఆ కళ నిజమైంది. అమెరికాకు చెందిన లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ హెక్సా పేరిట ఒక ఎగిరే కారును రెడీ చేసింది. దీనిని చూస్తే.. అచ్చి పెద్ద డ్రోన్ లా కనిపిస్తుంది. కానీ.. ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి వెళ్లిపోవచ్చు. ఇటీవల జపాన్‌లోని టోక్యోలో ఈ ఎగిరే కారు ‘హెక్సా’ను ప్రదర్శించారు. పది, పన్నెండు మీటర్ల ఎత్తులో ఈ కారును నడుపుతూ.. అందులో ఉన్న వ్యక్తి అందరికీ అభివాదం చేశాడు.
Uber buses : ఇక నుంచి ఉబర్ బస్సులు.. ఎక్కడ ప్రారంభిస్తున్నారో తెలుసా?
ఎగిరే కారు విశేషాలు..
ఈ కారు వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది. ల్యాండింగ్ నేల మీద.. నీటిలోనూ చేయవచ్చని వివరించింది. ఇది గాల్లోకి ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు ఉన్నాయి. సెకన్ల వ్యవధిలోనే ఎటు కావాలంటే అటు తిరిగేలా అమర్చారు. అంతేకాకుండా.. మనం వీడియో గేమ్ ఆడుకున్నట్టుగా ఒక చిన్న జాయ్ స్టిక్ సాయంతో దీనిని ఆపరేట్ చేయవచ్చు.
Also Read
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ధర ఎంత..?
ఈ ఎగిరే కారు ధర చూస్తే.. కేవలం రూ.4.12 కోట్లు. దీనిని కొనుగోలు చేయాలంటే.. ఇప్పటికిప్పుడు డెలివరీ లేదు. ముందుగా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేయాలి. ఆ తర్వాత రెడీ అయ్యాక అప్పుడు అందిస్తారు. ఇకపోతే.. ఈ కారులో ఒక్కరు తప్ప ఎక్కువ మంది ప్రయాణించడానికి లేదు. ఇది.. రీచార్జబుల్ బ్యాటరీలతో నడుస్తుంది. ఈ కారు గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలదని కంపెనీ తెలిపింది.
ముఖ్యంగా.. ఆఫీసులకు వెళ్లే వాళ్లకి ఈ ఎగిరే కారు మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే.. రోడ్లపై కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే అక్కడే ఇరుక్కుపోతాం. అదే ఇందులో ఐతే.. గాల్లో హ్యాపీగా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్లొచ్చు. అయితే.. భవిష్యత్ లో మాత్రం ఈ ఫ్లయింగ్ కార్లు గాల్లో దూసుకుపోవడం ఖాయమని నెటిజన్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!