NTV Telugu Site icon

Flying car: ఎగిరే కారు వచ్చేసిందోచ్.. విశేషాలివే!

Flying Car

Flying Car

పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. ఇక వర్షం పడితే అంతే సంగతులు.. అక్కడే ఉండిపోవాల్సందే. అలాంటప్పుడు అనిపిస్తుంది. గాల్లో ఎగిరిపోతే బాగుండు అని.. ఇప్పుడు ఆ కళ నిజమైంది. అమెరికాకు చెందిన లిఫ్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ హెక్సా పేరిట ఒక ఎగిరే కారును రెడీ చేసింది. దీనిని చూస్తే.. అచ్చి పెద్ద డ్రోన్ లా కనిపిస్తుంది. కానీ.. ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి వెళ్లిపోవచ్చు. ఇటీవల జపాన్‌లోని టోక్యోలో ఈ ఎగిరే కారు ‘హెక్సా’ను ప్రదర్శించారు. పది, పన్నెండు మీటర్ల ఎత్తులో ఈ కారును నడుపుతూ.. అందులో ఉన్న వ్యక్తి అందరికీ అభివాదం చేశాడు.

Uber buses : ఇక నుంచి ఉబర్ బస్సులు.. ఎక్కడ ప్రారంభిస్తున్నారో తెలుసా?
ఎగిరే కారు విశేషాలు..
ఈ కారు వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది. ల్యాండింగ్ నేల మీద.. నీటిలోనూ చేయవచ్చని వివరించింది. ఇది గాల్లోకి ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు ఉన్నాయి. సెకన్ల వ్యవధిలోనే ఎటు కావాలంటే అటు తిరిగేలా అమర్చారు. అంతేకాకుండా.. మనం వీడియో గేమ్ ఆడుకున్నట్టుగా ఒక చిన్న జాయ్ స్టిక్ సాయంతో దీనిని ఆపరేట్ చేయవచ్చు.

ధర ఎంత..?
ఈ ఎగిరే కారు ధర చూస్తే.. కేవలం రూ.4.12 కోట్లు. దీనిని కొనుగోలు చేయాలంటే.. ఇప్పటికిప్పుడు డెలివరీ లేదు. ముందుగా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేయాలి. ఆ తర్వాత రెడీ అయ్యాక అప్పుడు అందిస్తారు. ఇకపోతే.. ఈ కారులో ఒక్కరు తప్ప ఎక్కువ మంది ప్రయాణించడానికి లేదు. ఇది.. రీచార్జబుల్‌ బ్యాటరీలతో నడుస్తుంది. ఈ కారు గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలదని కంపెనీ తెలిపింది.

ముఖ్యంగా.. ఆఫీసులకు వెళ్లే వాళ్లకి ఈ ఎగిరే కారు మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే.. రోడ్లపై కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే అక్కడే ఇరుక్కుపోతాం. అదే ఇందులో ఐతే.. గాల్లో హ్యాపీగా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్లొచ్చు. అయితే.. భవిష్యత్ లో మాత్రం ఈ ఫ్లయింగ్ కార్లు గాల్లో దూసుకుపోవడం ఖాయమని నెటిజన్లు చెబుతున్నారు.