Site icon NTV Telugu

Heroine Namitha: హీరోయిన్ సంచలన నిర్ణయం.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్..!

8

8

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే వారి అభ్యర్థులను ఎంపిక చేసి గెలుపే లక్ష్యంగా వారు రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే చాలాచోట్ల ఈసారి ఎలక్షన్స్ లో సినీతారలు పోటీ చేస్తున్నడంతో రాజకీయ వాతావరణం మరింత గ్లామర్ గా మారిపోతుంది. ఇందులో భాగంగానే తమిళనాడు రాష్ట్రంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువైందని అనుకోవచ్చు.

Also Read: Rishabh Pant: పంత్ పై మండి పడ్డ ఆడం గిల్‌క్రిస్ట్‌.. అసలు మ్యాటరేంటంటే..?!

ఇందులో భాగంగా తాజాగా తమిళ అగ్ర హీరోలలో ఒకరైన దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. 2026 లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో పోటీ లక్ష్యంగా ‘తమిళగ వెట్రిక్‌ కళగం’ అనే పార్టీని పెట్టి ప్రజల వైపు నడుస్తున్నారు. అయితే ఇప్పుడు 2026 లో జరగబోయే ఎన్నికల్లో హీరో విజయ్ పై స్టార్ హీరోయిన్ లలో ఒకరైన నమిత పోటీ చేస్తానంటూ తాజాగా వెల్లడించింది. కాకపోతే తమిళనాడు రాష్ట్రంలో హీరో విజయకు పెద్ద ఫ్యాన్ బేసే ఉంది.

Also Read: Sai Pallavi: వామ్మో.. సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఒక్కసారిగా అంతపెంచిందా..?!

ప్రస్తుతం నమిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో హీరో విజయ్ పై పోటీ చేస్తా అనడంతో.. తమిళనాడులో సీని అభిమానులు పెద్ద ఎత్తున హీరోయిన్ పై విరుచుకుపడుతున్నారు. హీరోయిన్ నమిత తమిళనాడు బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలుగా కొద్ది కాలం క్రితం నుండి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా బీజేపీ తరఫున నమిత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. ఇక హీరో విజయ్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫ్యాన్స్ స్పందించారు. నమిత హీరో విజయ్ పై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవంటూ హీరో విజయ్ అభిమానులు అంటున్నారు. మరికొందరైతే ‘ నీకు అంత సీను ఉందా’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version