Anu Emmanuel: కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఏ ఫీల్డ్ అయినా ప్రతిచోట అమ్మాయిలకు ఈ వేధింపులు తప్పడం లేదు. అయితే ఈ పదం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మధ్య మీ టూ అంటూ కాస్టింగ్ కౌచ్ కు గురైన చాలా మంది బయటకు వచ్చి తమ బాధను పంచుకున్నారు. అప్పట్లో బయటకు వచ్చిన కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు సంచలనం సృష్టించాయి. ఈ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నామంటూ ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులే కాకుండా పెద్ద పెద్ద హీరోయిన్ లు కూడా కొన్ని సందర్భాల్లో తెలిపారు. ఇక ఇలాంటి వాటిని తాము ఎలా ఎదుర్కొన్నామో కూడా తెలిపారు. ఇక కొంత మంది ఇవి చాలా కామన్ అంటూ కొట్టిపడేశారు కూడా. తాజా హీరోయిన్ అను ఇమ్మానుయేల్ కూడా తానూ కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని వెల్లడించింది.
Also Read: English Teacher Selling Momos: ఇంగ్లీష్ టీచర్ మోమోస్.. వీటి ప్రత్యేకత అదే!
చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మానుయేల్. తరువాత ఈ మలయాళ బ్యూటీ నిఫిన్ బాలికి జంటగా యాక్షన్ హీరో బిజూ అనే మలయాళ చిత్రం 2016 లో నటించి హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఇక అదే ఏడాది ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా చేసిన మజ్ను తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇక ఆ తరువాత మరో కోలివుడ్ సినిమాలో శివకార్తికేయన్ కు జంటగా నటించింది. వీరు జంటగా నటించిన ‘నమ్మవీట్టు పిళ్లై’ మంచి టాక్ తెచ్చుకుంది. అయితే దీంతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మకు నిరాశే ఎదురయ్యింది. దాంతో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ పై ఇంట్రస్ట్ పెట్టింది. ఇక్కడ ఆమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశమే దక్కింది. అజ్ఞాతవాసి లో పపన్ కళ్యాణ్ సరసన, నా పేరు సూర్య మూవీలో బన్నీతో జత కట్టింది ఈ బ్యూటీ. ఇక గీత గోవిందంలో కూడా ఓ చిన్న పాత్రను చేసింది. ఇక రీసెంట్ గా అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే టాలీవుడ్ లో కూడా అను కు అనుకున్నంత సక్సెస్ దొరకలేదు. ఇప్పటకీ కూడా టాప్ హీరోయిన్ కాలేకపోయింది.
ఇక తాజాగా ఈ ముద్దు గుమ్మ హీరో కార్తీకి జంటగా ‘జపాన్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దీనిపై భారీగానే ఆశలు పెట్టుకుంది ఈ అమ్మడు. అయితే ఈ చిత్రం ప్రమోషన్లలలో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఇండస్ట్రీలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని ఆ సమయంలో తనకు కుటుంబం అండగా నిలిచిందని పేర్కొంది. ఎవరికైనాఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబం అండగా నిలిస్తే దానిని సులువుగానే ఎదుర్కోవచ్చని తెలిపింది.