Site icon NTV Telugu

Abbas – Vineeth : చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్రేమ దేశం హీరోలు

Abbas Vineeth

Abbas Vineeth

కోలీవుడ్ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ప్రేమ దేశం ఒకటి. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా మందికి హాట్ ఫేవరేట్. 1996లో కథిర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ తమిళంలోనే కాదు తెలుగులోనూ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ చార్డ్ బస్టర్సే. ఇప్పటికీ సాంగ్స్ వింటుంటే ఫ్రెష్ ఫీలింగ్స్ కలుగుతుంటాయి. ఇక వినీత్, అబ్బాస్ ఈ సినిమాతో విపరీతంగా పాపులరయ్యారు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు ఇండస్ట్రీని ఏలేస్తారు అనుకున్నారు.

Also Read : Sudha Kongara : పరాశక్తి ప్లాప్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ, అభిషేక్ బచ్చన్

కానీ టాలీవుడ్, కోలీవుడ్ చేసిన సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఓన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌కే పరిమితమయ్యాడు వినీత్. అబ్బాస్ హీరోగా కలిసి రాకపోవడంతో కొన్ని సినిమాల్లో నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్‌తో సరిపెట్టేసి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. లాంగ్ బ్యాక్ తర్వాత వినీత్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆయన నటించిన రెండు మలయాళ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాయి. ఏకం అనే ఫిల్మ్ రూ. 50 కోట్లను కొల్లగొట్టి డీసెంట్ హిట్ అందుకుంటే సర్వం మాయ క్రిస్మస్‌కు రిలీజై రూ. 125 కోట్లను కొల్లగొట్టి 2025 హయ్యెస్ట్ గ్రాసర్ మాలీవుడ్ ఫిల్మ్స్‌లో ఒకటిగా మారింది. ఇందులో హీరోయిన్ తండ్రిగా మెప్పించాడు వినీత్. ఇక అబ్బాస్ విషయానికి వస్తే.. పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళంలో పుష్కర కాలం తర్వాత జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తున్న హ్యాపీ రాజ్‌లో గౌరీ ప్రియ తండ్రిగా కనిపించబోతున్నాడు. అబ్బాస్ రీ ఎంట్రీలో ఏ మేరకు ఆఫర్స్ అందుకుంటాడో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Exit mobile version