NTV Telugu Site icon

KGF Re Release : ఏంటి.. ప్రశాంత్ మామ ఇలా షాక్ ఇచ్చావ్..

Kgf

Kgf

కేజీఎఫ్.. కన్నడ ఇండస్ట్రీలో భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. తెలుగులో కూడా అంతే రేంజులో టాక్ ను సొంతం చేసుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో యాభై కోట్లకు పైగా కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది. కేజీయఫ్ చాప్టర్ 1 ఎంతలా హిట్ అయిందో.. చాప్టర్ 2 కూడా అంతే హిట్ అయింది.. ఇదిలా ఉండగా ఈ సినిమా మళ్ళీ రీరీలిజ్ కాబోతుందని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది..

టాలీవుడ్ లో ఇటీవల పాత సినిమాలు మళ్ళీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి.. అయితే కొన్ని సినిమాలు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా మరికొన్ని సినిమాలు మాత్రం అంత టాక్ ను అందుకోలేక పోతున్నాయి.. పాత సినిమాల మీద ఇప్పుడు అందరికీ మోజు ఏర్పడుతోంది. అయితే అన్ని చిత్రాలు థియేటర్లకు జనాల ను రప్పించడం లేదు. రీ రిలీజ్ చేేసేందుకు పెట్టిన డబ్బుల్ని కూడా రికవరీ చేయలేక మళ్లీ పరాజయాన్ని అందుకుంటున్నాయి..

ఇప్పటికే చాలా సినిమాలు మళ్ళీ రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అందులో పోకిరి, ఒక్కడు, జల్సా, తొలి ప్రేమ, ఖుషి, ఆరెంజ్ ఇలా సెలెక్టెడ్ మూవీస్ మాత్రం రీ రిలీజ్‌లోనూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తమిళంలో గిల్లీని రీ రిలీజ్ చేస్తే ఏకంగా యాభై కోట్ల గ్రాస్ వచ్చిందని చెబుతున్నారు.. ఇప్పుడు ఎటువంటి అప్డేట్ లేకుండా ఇప్పుడు మరో బ్లాక్ బాస్టర్ సినిమా రీరిలీజ్ అవ్వబోతుంది. కేజీయఫ్ రీ రిలీజ్‌కి ఒక్క థియేటర్ అయినా ఫుల్ అవుతుందా? కలెక్షన్స్ మళ్ళీ వసూల్ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం యష్ సినిమాల విషయానికొస్తే .. టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా ఒక్క అప్డేట్ కూడా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు..