NTV Telugu Site icon

Hero Xtreme 200S 4V Launch: హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200ఎస్ 4వీ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

2023 Hero Xtreme 200s 4v

2023 Hero Xtreme 200s 4v

Hero Xtreme 200S 4V 2023 Launch in India: హీరో మోటోకార్ప్ తన ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్‌లో అప్‌డేటెడ్ ఫోర్-వాల్వ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200ఎస్ 4వీని భారతదేశంలో రూ. 1.41 లక్షల ధరతో విడుదల చేయబడింది (ఎక్స్‌-షోరూమ్‌ ఢిల్లీ). ఇది డ్యూయల్-టోన్ షేడ్స్‌తో సహా మూడు రంగులలో ఒకే వేరియంట్‌ను తీసుకొచ్చింది. మూన్ ఎల్లో, పాంథర్ బ్లాక్ మెటాలిక్ మరియు ప్రీమియం స్టెల్త్ ఎడిషన్‌లలో హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200ఎస్ 4వీ అందుబాటులో ఉంటుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200ఎస్ 4వీలో నాలుగు-వాల్వ్ ఇంజిన్ ఇవ్వబడింది. ఇది మొదటి ఇంజిన్ కంటే.. 6 శాతం ఎక్కువ శక్తిని మరియు 5 శాతం ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 8,000 ఆర్పీఎం వద్ద 18.9 బీఎచ్పీ మరియు 6,500 ఆర్పీఎం వద్ద 17.35ఎన్ఎం ఉత్పత్తి చేసే 199.6cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్, ఫోర్-స్ట్రోక్, ఫోర్-వాల్వ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్ వస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200ఎస్ 4వీలో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. సింగిల్-ఛానల్ ABSతో పాటు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. భారతదేశంలో ఈ బైక్ ధర రూ. 1.41 లక్షలుగా ఉంది. బైక్ ఇంటికి వచ్చేసరికి ఈ ధర మరింత పెరగనుంది.

Also Read: Sri Ramana Died: ‘మిథునం’ సినిమా రచయిత శ్రీరమణ కన్నుమూత!

Also Read: IND vs WI: కేవలం 12 మ్యాచ్‌లే.. సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టనున్న కోహ్లీ!

Show comments