Vishwak Sen: స్నో కింగ్‌డమ్‌లో ‘గామి’ ప్రెస్‌మీట్.. ఇండియాలోనే తొలిసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen about Gaami OTT: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఎపిక్ అడ్వంచర్ థ్రిల్లర్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి, అభినయ కీలక పాత్రలు పోషించారు. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రంకు నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8న విడుదలైన గామి.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అఘోరా పాత్రలో విశ్వక్ నటన అందరినీ ఆకట్టుకుంది. గామి చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. జీ5లో శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీ రిలీజ్ సందర్భంగా గామి చిత్ర యూనిట్ స్నో కింగ్‌డమ్‌లో మీడియాతో ముచ్చటించింది. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ… ‘ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఇలా స్నో కింగ్‌డమ్‌లో నిర్వహించాలనే ఐడియా జీ5 టీందే. ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదని అనుకున్నా. ఒకవేళ ముందే వస్తే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా ఇలా చలిలోనే చేసేవాడ్ని. గామి లాంటి సినిమాలకు మామూలుగా అవార్డులు, ప్రశంసలు వస్తుంటాయి కానీ.. కలెక్షన్లు రావని అంతా అనుకుంటారు. కానీ ఇది నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లను సాధించింది. గామిలో కమర్షియల్ అంశాలేవీ ఉండవు. అయినా ఆడియెన్స్ చాలా బాగా ఆదరించారు. వారణాసిలోని ఘాట్‌లో శవాలు కాలుతున్నా.. ఓ 20 నిమిషాలు షూట్ చేశాం. చావుని వాళ్లు సెలెబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు నాకు జీవితం చాలా చిన్నది అనిపించింది. ఇలాంటి కథను నమ్మాలి. నాకు పెద్ద రిస్క్ అనిపించలేదు. ఓ ఫ్లాప్ సినిమాను తీయడం కంటే.. ఇలాంటి కథను నమ్మడం బెటర్. గామిని థియేటర్లో అందరూ చూశారు. మాకు మంచి రివ్యూలు ఇచ్చారు. ఇక ఏప్రిల్ 12 నుంచి సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.
Also Read
- OTR: మెదక్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ బయటపడ్డ విబేధాలు
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
Also Read: Uppal Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే.. నిమిషానికే టికెట్లు సోల్డ్ అవుట్!
డైరెక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ… ‘థియేటర్లో మా సినిమా కొంత మందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. మూడు నాలుగు సార్లు చూస్తే మా థీమ్ ఏంటి?, మా కాన్సెప్ట్ ఏంటి? అన్నది అందరికీ ఈజీగా అర్థమవుతుంది. మేం ఎప్పుడూ ఈ సినిమా కోసం లెక్కలు వేసుకోలేదు. చిన్నా, పెద్దా.. బడ్జెట్ అంటూ ఇలా లెక్కలేసుకుండా సినిమా తీశాం. జీ5లో ఏప్రిల్ 12 నుంచి మా చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ వీక్షించండి’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: తెలంగాణలో భారీ ఎత్తున డబుల్ శాలరీ స్కామ్
-
OTR: మెదక్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ బయటపడ్డ విబేధాలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!