Hero Vishnu Manchu On Kannappa Movie: ‘కన్నప్ప’ కథ తన మనసుకు ఎంతో దగ్గరైందని హీరో మంచు విష్ణు అన్నారు. కన్నప్ప భక్తి భావాన్ని, చరిత్రని ప్రపంచమంతా తెలుసుకోవాలన్నదే తన అభిమతం అన్నారు. కామిక్ పుస్తకం సినిమాలానే ఉంటుందని మంచు విష్ణు తెలిపారు. మంగళవారం (మార్చి 19)న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్, ముఖేష్ రిషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేతుల మీదుగా కన్నప్ప కామిక్ బుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు మాట్లాడుతూ… ‘కన్నప్ప కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్ పుస్తకం.. సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాల్ని తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అవుతుందని నేను బావిచాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది’ అన్నారు.
Also Read: Actress Radha: నటి రాధపై కేసు నమోదు!
మంచు విష్ణు హీరోగా కన్నప్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్‌మెంట్స్‌పై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కన్నప్ప చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నప్ప తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.