Site icon NTV Telugu

Vishal : తెలుగు మీడియాని లైట్ తీసుకున్న విశాల్?

Vishal Vs Tfpc

Vishal Vs Tfpc

హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ హీరోనే అయినా తెలుగువాడే కావడంతో తెలుగు ప్రేక్షకులు మనోడిని బాగానే ఓన్ చేసుకున్నారు. దాదాపుగా విశాల్ తమిళంలో చేసే సినిమాలు అన్నీ డబ్బింగ్ అయి తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాదాపు 12 ఏళ్ల క్రితం చేసిన మదగజ రాజా అనే ఒక సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ హీరోగా వరలక్ష్మీ శరత్ కుమార్ అంజలి హీరోయిన్లుగా ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం రిలీజ్ కావాల్సి ఉంది. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కావడమే కాదు కోట్ల రూపాయల కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.

Hanmakonda Crime: ఏకాంతంగా ప్రేమికులు.. తండ్రి ఎంత పనిచేశాడంటే.?

ఈ నేపథ్యంలో ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. అందులో భాగంగానే ఈ శుక్రవారం నాడు అంటే జనవరి 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ సిద్ధం చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్లు వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి ఇద్దరూ హైదరాబాద్ వచ్చారు. కానీ విశాల్ మాత్రం రాలేదు. అయితే చెన్నైలో బిజీగా ఉండే ఉంటారు అనుకున్నారు కానీ నిజానికి విశాల్ ఈ సినిమా టీం తో టచ్ లో లేరనే ప్రచారం జరుగుతోంది. నిన్న లైవ్ లోనే అంజలి విశాల్ కి ఫోన్ చేసింది కానీ విశాల్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కేవలం అంజలి కాల్స్ మాత్రమే కాదు సినిమా టీంలోని ఎవరి కాల్స్ కి ఆయన స్పందించడం లేదని తెలుస్తోంది. ఒక రకంగా తెలుగు ప్రమోషన్స్ని ఆయన లైట్ తీసుకున్నాడు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

Exit mobile version