NTV Telugu Site icon

Venkatesh Daggubati: మొన్న కాంగ్రెస్‌కు.. నేడు కూటమికి వెంకీ మామ ప్రచారం!

Venkatesh Election Campaign

Venkatesh Election Campaign

Hero Venkatesh Supports To Kaikalur MLA Candidate Kamineni Srinivas Rao: విక్టరీ వెంకటేశ్‌ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం (మే 7) ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన వెంకీ మామ.. నేడు కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ కూడలి వరకు వెంకటేశ్‌ రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ గారిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మంచి తనానికి మారు పేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాసరావు అని విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. శ్రీనివాస్ గారిని తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. వెంకీ వచ్చాడని తెలియడంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. వెంకటేశ్ చేయి ఊపుతూ అభిమానులను అలరించారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Team India Coach: ఒక్క చాన్స్ ప్లీజ్.. టీమిండియా కోచ్‌గా చేస్తా!

మొన్న కాంగ్రెస్‌కు ప్రచారం చేసిన విక్టరీ వెంకటేశ్‌.. నేడు ఎన్డీయే కూటమికి ప్రచారం చేయడం విశేషం. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి.. వెంకీకి వియ్యంకుడు అన్న సంగతి తెలిసిందే. ఇక కైకలూరు నుంచి వైసీపీ తరఫున దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Show comments