Site icon NTV Telugu

Sri Vishnu: వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా.. లేదంటే లావైపోతా: శ్రీ విష్ణు

Sri Vishnu Swag

Sri Vishnu Swag

Sri Vishnu About Swag Movie: ‘శ్వాగ్‌’ సినిమాను ఆస్వాదించలేకపోయిన ఆ 10 శాతం మందికి కూడా తన తర్వాత సినిమాతో పూర్తి వినోదాన్ని ఇస్తానని హీరో శ్రీ విష్ణు మాటిచ్చారు. ప్రేక్షకులకు వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా అని, లేదంటే లావైపోతాను అని సరదాగా అన్నారు. ఏ సినీ నేపథ్యం లేని తనను ఈ స్థాయిలో ఉంచిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటూనే ఉంటానని శ్రీ విష్ణు చెప్పారు. హసిత్‌ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం శ్వాగ్‌. అక్టోబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు.

సక్సెస్‌ మీట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ… ‘కొన్ని సినిమాలు చూసినప్పుడు పక్కన వారితో చర్చిస్తాం. అలాంటి సినిమానే శ్వాగ్‌. ఈ సినిమా 90 శాతం మందికి నచ్చింది. 10 శాతం మంది మాత్రమే కథలో కాస్త గందరగోళం ఉందన్నారు. కొత్తగా ట్రై చేసినపుడు ఇలాంటివి సహజమే. కథలో కాస్త కన్య్ఫూజన్‌ ఉందన్నారు కానీ.. సినిమా బాలేదని ఎవరూ చెప్పలేదు. గతంలో నేను చేసిన కొన్ని సినిమాల్లో నటనకు ఇప్పటికీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పుడు అందరూ శ్వాగ్‌ గురించే మాట్లాడుకుంటారు. శ్వాగ్‌ చూసేకొద్దీ కొత్తగా ఉంటుంది’ అని అన్నారు.

Also Read: IND vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన కివీస్.. స్టార్ ప్లేయర్ దూరం!

‘తెలుగు ప్రేక్షకులను గెలిపించడానికి శ్వాగ్‌ చేశాను. వారు గెలిచి మమ్మల్ని గెలిపించారు. రిస్క్‌ ఉన్న కథలు ఎంచుకోకపోతే.. తర్వాత తరం వారిలో స్ఫూర్తిని నింపలేం. ఏ సినీ నేపథ్యం లేని నన్ను ఈ స్థాయిలో ఉంచిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటూనే ఉంటాను. శ్వాగ్‌ను ఆస్వాదించలేకపోయిన ఆ 10 శాతం మందికి కూడా నా తర్వాత సినిమాతో పూర్తి వినోదాన్ని ఇస్తా. మీకు వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా, లేదంటే లావైపోతాను. సినిమాను ఆదరించిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని శ్రీ విష్ణు పేర్కొన్నారు. శ్వాగ్‌లో రీతూ వర్మ, మీరా జాస్మిన్‌ కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version