Sri Vishnu: వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా.. లేదంటే లావైపోతా: శ్రీ విష్ణు
- అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు శ్వాగ్
- హైదరాబాద్‌లో సక్సెస్ మీట్
- శ్వాగ్ చూసేకొద్దీ కొత్తగా ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Vishnu About Swag Movie: ‘శ్వాగ్’ సినిమాను ఆస్వాదించలేకపోయిన ఆ 10 శాతం మందికి కూడా తన తర్వాత సినిమాతో పూర్తి వినోదాన్ని ఇస్తానని హీరో శ్రీ విష్ణు మాటిచ్చారు. ప్రేక్షకులకు వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా అని, లేదంటే లావైపోతాను అని సరదాగా అన్నారు. ఏ సినీ నేపథ్యం లేని తనను ఈ స్థాయిలో ఉంచిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటూనే ఉంటానని శ్రీ విష్ణు చెప్పారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం శ్వాగ్. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.
సక్సెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ… ‘కొన్ని సినిమాలు చూసినప్పుడు పక్కన వారితో చర్చిస్తాం. అలాంటి సినిమానే శ్వాగ్. ఈ సినిమా 90 శాతం మందికి నచ్చింది. 10 శాతం మంది మాత్రమే కథలో కాస్త గందరగోళం ఉందన్నారు. కొత్తగా ట్రై చేసినపుడు ఇలాంటివి సహజమే. కథలో కాస్త కన్య్ఫూజన్ ఉందన్నారు కానీ.. సినిమా బాలేదని ఎవరూ చెప్పలేదు. గతంలో నేను చేసిన కొన్ని సినిమాల్లో నటనకు ఇప్పటికీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పుడు అందరూ శ్వాగ్ గురించే మాట్లాడుకుంటారు. శ్వాగ్ చూసేకొద్దీ కొత్తగా ఉంటుంది’ అని అన్నారు.
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
Also Read: IND vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన కివీస్.. స్టార్ ప్లేయర్ దూరం!
‘తెలుగు ప్రేక్షకులను గెలిపించడానికి శ్వాగ్ చేశాను. వారు గెలిచి మమ్మల్ని గెలిపించారు. రిస్క్ ఉన్న కథలు ఎంచుకోకపోతే.. తర్వాత తరం వారిలో స్ఫూర్తిని నింపలేం. ఏ సినీ నేపథ్యం లేని నన్ను ఈ స్థాయిలో ఉంచిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటూనే ఉంటాను. శ్వాగ్‌ను ఆస్వాదించలేకపోయిన ఆ 10 శాతం మందికి కూడా నా తర్వాత సినిమాతో పూర్తి వినోదాన్ని ఇస్తా. మీకు వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా, లేదంటే లావైపోతాను. సినిమాను ఆదరించిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని శ్రీ విష్ణు పేర్కొన్నారు. శ్వాగ్‌లో రీతూ వర్మ, మీరా జాస్మిన్ కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!