Site icon NTV Telugu

Salman Khan: షూటింగ్లో సల్మాన్ ఖాన్ కి ప్రమాదం.. భుజానికి తీవ్ర గాయం

Salman Khan

Salman Khan

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ లో గాయపడ్డారు. ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం టైగర్ 3. ఈ చిత్ర షూటింగులో పాల్గొంటుండగా సల్మాన్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడట. సల్మాన్ ఖాన్ మీద ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా తన ఎడమ భుజానికి గాయమైందని సల్మాన్ పేర్కొన్నారు. దాంతో వైద్యులు ఆయనకు హుటాహుటిన చికిత్స అందించారు. తన భుజానికైన గాయాన్ని చూపుతూ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.

Read Also:Undavalli Arun Kumar: రాహుల్‌లో ఇప్పుడు రాజీవ్ కనిపిస్తున్నారు.. కర్ణాటక ఫలితాలపై ఉండవల్లి కామెంట్‌..

సల్మాన్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలకు సీక్వెల్ గా తాజా చిత్రం టైగర్ 3 తెరకెక్కుతుంది. సల్మాన్ ఖాన్ కి జంటగా ఈ సినిమాలో కత్రినా కైఫ్ నటిస్తుంది. షారుక్ క్యామియో రోల్ చేస్తున్నారు. మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… యష్ రాజ్ ఫిలిమ్స్ సినిమా నిర్మిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. తమిళ చిత్రం వీరం కి రీమేక్ గా తెరకెక్కిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా నిరాశపరిచింది. టైగర్ 3 చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి రావాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారు.

Read Also:Malkajgiri Crime: కాళ్ల పారాణి ఆరకముందే.. నవవధువు ఆత్మహత్య

Exit mobile version