Site icon NTV Telugu

Mass-Maharaj Raviteja: ఆమె యాక్టింగ్ ఎంతో ఇష్టమంటున్న రవితేజ…!

2

2

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రవితేజ.. కొంతవరకు సక్సెస్ అయ్యారు. రవితేజ ప్రస్తుతం హరీశ్​ శంకర్ ​తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా మీదే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు ఈ సినిమా బృందం తెలిపింది.

Also read: Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

నిజానికి ఎంత పెద్ద స్టార్ హీరో, హీరోయిన్ అయిన సరే ఫేవరెట్ హీరో, హీరోయిన్, దర్శకులు ఉండటం సహజమే కదా.. ఇకపోతే రవితేజ కూడా ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరోయిన్ గురించి ప్రస్తావించారు. అదేవిధంగా ఇంటర్వ్యూలో అనుష్క, ఇలియానా, త్రిష, శ్రియ వీరిలో ఎవరు ఇష్టం అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు., తనకి అనుష్క అంటే ఇష్టమని, ముఖ్యంగా ఆమె యాక్టింగ్ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.

Also read: Viral Video: ఆర్సీబీ మహిళల జట్టుతో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్..!

ఇకపోతే ఆ ఇంటర్వ్యూలో అడిగిన హీరోయిన్ల అందరితోనూ రవితేజ ఒక్కో హిట్ సాధించారు. ముఖ్యంగా హీరోయిన్ ఇలియానాతో ఖతర్నాక్, కిక్​, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు చేశారు. వీటిలో ‘కిక్’ సూపర్ డూపర్ హిట్ సంధించింది. అలాగే మరో హీరోయిన్త్ త్రిషతో చేసిన కృష్ణ సినిమాలో నటించగా అది బాక్స్ ఆఫీస్ దగ్గర అది భారీ హిట్ అందుకుంది. ఇక మరో హీరోయిన్శ్ శ్రీయతో చేసిన భగీరథ ఆశించిన హిట్ సాధించలేకపోయింది. ఇక రవితేజ – అనుష్క కలిసి నటించిన సినిమా విక్రమార్కుడు. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన బలాదూర్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

Exit mobile version