Ram Charan No To Travel AP Today: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. భారీ వరదల కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో వేలాది కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందిపడ్డారు. వేలాది మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు అధికారులు తరలించారు. ఈ పరిస్థితుల నుంచి తెలుగు ప్రజలను ఆదుకునేందుకు సినీ తారలు తమ వంతు సాయం చేశారు.
‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. తమ విరాళంను అందించేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి చరణ్ రానున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. సీఎం చంద్రబాబును మెగా పవర్ స్టార్ కలుస్తాడని కూడా న్యూస్ వచ్చింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సీఎం చంద్రబాబును నేడు ఆయన కలవడం లేదు.
Also Read: Today Gold Rate: మగువలకు షాకింగ్ న్యూస్.. ఊహించని రీతిలో పెరిగిన బంగారం ధర!
‘వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నావంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’అని రామ్ చరణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.