NTV Telugu Site icon

Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

Raj Tarun

Raj Tarun

Raj Tarun: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఇప్పుడు ఓ అమ్మాయి కారణంగా చాలా బాధపడ్డాడట.. తను చేసిన పని తెలిసి ఆ అమ్మాయిని వెతికే పనిలో పడ్డాడట. తను కనపడితే చెప్పమంటున్నాడు.. తన అంతు చూడాలని ఉందని ఆగ్రహంగా ఉన్నాడు. ఇంతకు ఆ అమ్మాయి ఏం చేసిందో రాజ్ తరుణే వివరించాలి.

ఈ కుర్ర హీరో.. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆ తర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ యంగ్ హీరో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక సుకుమార్ శిష్యుడు సూర్య తెరకెక్కించిన కుమారి 21 ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ మధ్య రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈసెంట్ గా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Read Also: Ysrcp Sketch For Pawankalyan Live: పవన్ కళ్యాణ్ కోసం వైసీపీ స్కెచ్

రాజ్ తరుణ్ రీసెంట్‌గా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘హలో అండీ.. నేను సడెన్‌గా ఈ వీడియో పెట్టడానికో కారణం ఉంది.. మీకొక అమ్మాయి గురించి చెప్పాలి.. నా జీవితంలో అమ్మాయి అనే టాపిక్ వస్తుందని నేనెప్పుడూ అనుకోలా.. నాకు చిన్నప్పటినుండి అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం.. అర్థమైపోయింది.. మన జీవితంలో లవ్వూ, గివ్యూ సెట్ కావని.. సిన్సియర్‌గా వెళ్లి నాకు పెళ్లి చేయ్యండని మా అమ్మా, నాన్నని అడిగా.. మొదట కంగారుపడ్డా.. తర్వాత నా కరువు అర్థం చేసుకుని ఓ మంచి సంబంధం చూశారు.

Read Also: Twitter: ట్విటర్ జర్నీ.. మస్క్‌కి ముందు, ఆ తర్వాత!

ఇంకేముంది.. పెళ్లి సెట్, మండపం సెట్టు, రాబందులు, అదే చుట్టాలొచ్చారు.. పండక్కి తయారు చేసిన గంగిరెద్దులా రెడీ చేసి కూర్చోబెట్టారు. మండపానికి తీసుకెళ్లి, పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు.. పంతులు, పెళ్లి కూతుర్ని తీసుకురామ్మా.. అన్నాడు.. వాళ్ల చెల్లి వెళ్లి ఓ ఉత్తరం పట్టుకొచ్చింది.. ఛీ, ఛీ.. నా నోటితో నేను చెప్పలేను.. మీకర్థమై ఉంటుంది కదా.. మొగుడు పోయి ఏడుస్తుంటే సామెతలా ఈ చుట్టాలంతా వచ్చి ఎధవ ఎటకారాలు.. చచ్చిన పాముని ఇంకా ఎంత సేపు చంపుతారు.. వాళ్లని కాదు.. దాన్ననాలి.. ఒసేయ్, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా.. నీ అంతు చూస్తా.. రేపే నీ ఫొటో ఆన్‌లైన్‌లో పెడతా.. మీ అందరూ కూడా కనబడితే నాకు చెప్పండి.. ప్లీజ్.. థ్యాంక్యూ వెరీమచ్’’ అంటూ చెప్పుకొచ్చాడు.