ట్విటర్‌పై తనకున్న అమితమైన ఇష్టం కారణంగా.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ $44 బిలియన్‌కి ట్విటర్‌ని కొంటానని ఏప్రిల్‌లో ప్రకటించాడు.

యితే.. డీల్ కుదరడానికి ముందు తనకు నకిలీ డేటా తప్పకుండా అందించాల్సిందేనని మస్క్ ఒక కండీషన్ పెట్టాడు.

నిర్దిష్ట సమయంలో తనకు ఫేక్ డేటా సమాచారాన్ని ఇవ్వకపోవడంతో.. జూన్ నెలలో తాను డీల్ రద్దు చేస్తున్నానని మస్క్ బాంబ్ పేల్చాడు.

ఈ వ్యవహారంలో ట్విటర్ సంస్థ మస్క్‌కి వ్యతిరేకంగా కోర్టుకెక్కింది. డీల్ ప్రకారం.. 44 బిలియన్ డాలర్స్‌కి ట్విటర్‌ని కొనాల్సిందేనని పట్టుబడింది.

ఆ సమయంలో ట్విటర్‌కి, మస్క్‌కి మధ్య పెను యుద్ధమే నడిచింది. ఒకరిపై మరొకరు ట్రోల్స్, విమర్శలు బాగానే చేసుకున్నారు.

చివరికి మస్క్ వెనకడుగు వేసి.. కోర్టు ఇచ్చిన గడువు (అక్టోబర్ 28)కి ముందే ట్విటర్‌ని $44 బిలియన్‌కి స్వాధీనం చేసుకున్నాడు.

ఆ వెంటనే మస్క్.. ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను, లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ్ గద్దెను తొలగించేశాడు.

మస్క్ రంగంలోకి దిగాక.. 75% ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు వార్తలొచ్చాయి కానీ, అలాంటి ఆలోచనలు లేవని మస్క్ క్లారిటీ ఇచ్చాడు.

షేధానికి గురైన ఖాతాల్ని.. సమీక్ష నిర్వహించిన తర్వాత తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మస్క్ సన్నాహాలు చేస్తున్నాడు.