NTV Telugu Site icon

Ram Charan Birthday: తండ్రికి తగ్గ తనయుడిగా.. రామ్ చరణ్ మరింత విజయాలు అందుకోవాలి: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Og

Pawan Kalyan Og

Pawan Kalyan Wish Ram Charan: ఈరోజు టాలీవుడ్‌ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ పుట్టినరోజు. నేటితో ఆయన 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా చరణ్‌-ఉపాసన దంపతులు ఈ రోజు ఉదయం కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా చరణ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెష్ చెప్పారు. రానున్న రోజుల్లో చరణ్ మరింత విజయాలు అందుకోవాలని కోరుకున్నారు.

‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్.. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞుల పట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే అతడికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి, మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్.. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Also Read: Deepak Chahar: సీఎస్‌కే కెప్టెన్ ఎవరో తెలియక తికమక పడుతున్నా: దీపక్ చహర్

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.పొలిటికల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో చరణ్‌ నటిస్తున్నారు. ఆర్‌సీ 16 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.

Show comments