NTV Telugu Site icon

Mr.Celebrity : సెలబ్రిటీగా మారాలనేది యువకుడి కోరిక.. కట్ చేస్తే.. ‘మిస్టర్ సెలెబ్రిటీ’ ట్రైలర్ చూశారా?

Mr

Mr

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా నటించిన ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రానా దగ్గుబాటి ఈ ట్రైలర్ ను విడుదల చేశాడు. ఆర్‌పీ సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి నటులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు విడుదలయ్యాయి. ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నాయి. ట్రైలర్‌ చూసిన ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది.

READ MORE: Prashant Kishor: కొత్త పార్టీ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. పార్టీ పేరు ఇదే..!

ట్రైలర్ విడుదల చేసిన రానా చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపాడు. సెలబ్రిటీగా మారాలనుకొనే యువకుడి కథగా ఇది రానున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మూవీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రాబోతోందని తెలుస్తోంది. సెలెబ్రిటీ ట్రైలర్‌‌లో హీరో యాక్షన్, వినోద్ ఆర్ఆర్, శివకుమార్ కెమెరా వర్క్ హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఇక విలన్ ఎవరన్నది చూయించలేదు. ఆ పాయింట్‌తో సినిమా మీద అందరిలోనూ ఆసక్తి మొదలవుతుందని డైరెక్టర్ ఆలోచన. ఇదిలా ఉండగా.. ఈ సినిమా అక్టోబర్ 4న తెరపైకి రానుంది.

READ MORE:Heavy Rains: విజయవాడలో భారీ వర్షం.. దసరా ఉత్సవాల పనులకు ఆటంకం

 

Show comments