Site icon NTV Telugu

Attack On Hindu Temple: హిందూ ఆలయంపై దుండగుల దాడి.. ఏడాదిలో ఇది మూడోసారి

Temple

Temple

Attack On Hindu Temple: కెన‌డాలో దుండగులు వరుసగా హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. దీంతో అక్కడ నివసిస్తున్న భారతీయుల్లో ఆందోళన తలెత్తుతోంది. తాజాగా, బ్రాంప్టన్ పట్టణంలోని గౌరీ శంక‌ర్ దేవాలయంలో దుండ‌గులు భార‌త వ్యతిరేక రాత‌లు రాశారు. ఆల‌యంపై జరిగిన దాడిని టొరొంటోని భార‌త కాన్సులేట్ జ‌న‌ర‌ల్ ఖండించారు. గ‌తేడాది జులై నుంచి ఇప్పటి వ‌ర‌కు కెన‌డాలో మూడు సార్లు హిందూ మందిరాల‌పై దాడులు జ‌రిగాయి. గ‌త ఏడాది సెప్టెంబ‌రులో భార‌త విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించిన విష‌యం తెలిసిందే.

Read Also: Telangana Budget : బడ్జెట్ కి గవర్నర్ ఆమోదం.. ఫిబ్రవరి 6న అసెంబ్లీలో పెట్టే ఛాన్స్

”మందిరంపై దుండ‌గులు పాల్పడ్డ ద్వేష‌పూరిత చ‌ర్యతో కెన‌డాలోని భార‌తీయుల మ‌నోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విష‌యాన్ని కెన‌డా అధికారుల వ‌ద్ద లేవ‌నెత్తాము” అని అక్కడి భార‌త దౌత్య కార్యాల‌యం ప్రకటించింది. భార‌తీయ వార‌స‌త్వానికి ప్రతీకగా ఉన్న మందిరంపై దాడికి పాల్పడి, ద్వేష‌పూరిత రాత‌లు రాయ‌డంపై కెన‌డా అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు.కెన‌డాలో భార‌తీయుల‌పై నేర‌పూరిత చ‌ర్యలు, భార‌త వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయ‌ని, స‌రైన విచార‌ణ జ‌ర‌పాల‌ని చెప్పింది. కెన‌డాలో కొంత కాలంగా మ‌తాన్ని ల‌క్ష్యంగా చేసుకుని దాడులు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు విప‌రీతంగా పెరిగాయి.

Read Also: Teachers Transfer : టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు పొడగింపు

Exit mobile version