NTV Telugu Site icon

Railway Technology: మూడు ట్రాక్ లపై నడిచే ట్రైన్.. ఎప్పుడైనా చూశారా..!

Train

Train

మీరు ఎప్పుడో రైలులో ప్రయాణం చేసి ఉంటారు. అయితే రైల్వే ట్రాక్‌లను కూడా మీరు చూసే ఉంటారు. భారతదేశంలోని రైల్వేలు రెండు ట్రాక్‌లపై నడుస్తాయి. చాలా దేశాల్లో రైల్వేల కోసం కేవలం రెండు ట్రాక్‌లు మాత్రమే ఉంటాయి. అయితే ప్రపంచంలో రెండు కాదు మూడు ట్రాక్‌లపై రైలు నడిచే దేశం కూడా ఒకటి ఉంది. అది ఎక్కడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Also Read: Manappuram Finance: రూల్స్ అతిక్రమించిన మణప్పురం ఫైనాన్స్.. రూ.20లక్షల జరిమానా వేసిన ఆర్బీఐ

ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ జాబితాలో భారతీయ రైల్వే మొదటి స్థానంలో ఉంది. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ గా నిలిచింది. రైల్వే ప్రతిరోజూ 13 వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లను నడుపుతు.. ఇవి ఏడు వేలకు పైగా రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తున్నాయి. అయితే భారత్ కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో, రైళ్లు మూడు ట్రాక్‌లపై నడుస్తాయి. రెండు ట్రాక్‌లపై నడిచే రైలును బ్రాడ్ గేజ్ అంటారు. బంగ్లాదేశ్‌లో రైళ్లను నడపడానికి డ్యూయల్ గేజ్ ను ఉపయోగిస్తుంటారు.

Also Read: Barber Shop: మసాజ్‌ కోసం వెళ్ళిన కస్టమర్‌.. మెడ ఖాళీ చేసి పంపిన బార్బర్‌

అయితే బంగ్లాదేశ్ లోని ఈ ట్రాక్‌లో 3 ట్రాక్‌లు ఉంటాయి. ఎందుకంటే ప్రతి రైల్వే ట్రాక్ గేజ్ ప్రకారం తయారు చేయబడింది. అందువల్ల ట్రాక్‌ల వెడల్పు వివిధ భాగాలలో మారుతూ వస్తుంది. ఇక్కడి రైల్వేలు బంగ్లాదేశ్ ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నాయి.. వీటి మొత్తం పొడవు 2,855 కిలో మీటర్లు. బంగ్లాదేశ్‌లో మూడు రకాల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఇందులో మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ తో పాటు డ్యూయల్ గేజ్ లు కూడా ఉన్నాయి.

Also Read: Fire Accident: ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం.. కస్టమర్స్ ఏంచేశారంటే..

గతంలో ఇక్కడ మీటర్, బ్రాడ్ గేజ్ రైళ్లు మాత్రమే నడిచేవి.. కానీ కాలక్రమేణా అవి మారడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితిలో బంగ్లాదేశ్ నుంచి పాత ట్రాక్‌ను మార్చడం సరైనదని కాదని.. అందుకోసం లోకోమోటివ్‌ల నుంచి కోచ్‌లకు కూడా మారాల్సి ఉంటుంది. దీనివల్ల రైల్వేపై మరింత భారం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, డ్యూయల్ గేజ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Also Read: Bihar: భూమ్మీద నూకలుండడం అంతే ఇదేనేమో.. రైలు కిందపడ్డా చిన్న గీతకూడా పడలేదు

ఈ డ్యూయల్ గేజ్ అంటే ఏమిటి అని మీరు ఆశ్చర్యపోకండి. అయితే డ్యూయల్ గేజ్ మీటర్ గేజ్ , బ్రాడ్ గేజ్‌తో రూపొందించబడింది. రెండింటి కంటే ఎక్కువ రైల్వే ట్రాక్‌లలో, రెండు వేర్వేరు గేజ్ రైళ్లు ఒకే ట్రాక్‌పై నడుస్తాయి. మూడవది సాధారణ గేజ్.. కామన్ గేజ్ వివిధ గేజ్‌ల కార్లకు సహాయపడుుతుంది. బంగ్లాదేశ్‌తో పాటు, డ్యూయల్ గేజ్‌ని ఉపయోగించే మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి.

Show comments