NTV Telugu Site icon

Jio Data Booster Plans: డైలీ డేటా లిమిట్ అయిపోయిందా?.. బూస్టర్ ప్లాన్స్ ఇవే!

Reliance Jio

Reliance Jio

Reliance Jio Data Booster Plans 2024: ప్రస్తుతం రోజుల్లో అందరూ ఇంటర్నెట్ డేటాను భారీగా వాడుతున్నారు. ఆఫీసు వర్క్, యూపీఐ పేమెంట్లు, సోషల్ మీడియా, టీవీ షో లాంటి మొదలైన వాటికి ఇంటర్నెట్ డేటాను ఉపయోగిస్తున్నారు. వర్క్ చేస్తున్నపుడు లేదా యూపీఐ పేమెంట్లు చేసేటపుడు డేటా అయిపోవడం వల్ల పని మధ్యలోనే ఆగిపోతుంటుంది. చాలావరకూ మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నప్పటికీ.. డైలీ డేటా లిమిట్ అయ్యాక డేటా స్పీడ్ తగ్గుతుంది. ఇక నుంచి ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ యూజర్లు డైలీ డేటా లిమిట్ అయిపోయినా.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

ఎటువంటి అంతరాయాలు లేకుండా డేటాను పొందడానికి ప్రీపెయిడ్ డేటా బూస్టర్ ప్లాన్‌లను జియో తీసుకొచ్చింది. చిన్న టాప్-అప్ అయినా లేదా పెద్ద మొత్తంలో డేటా బూస్ట్ అవసరమైనా.. జియో ప్రీపెయిడ్ డేటా బూస్టర్ ప్లాన్‌లు ఉన్నాయి. రూ.15 ప్లాన్, రూ.19 ప్లాన్, రూ.25 ప్లాన్, రూ.29 ప్లాన్, రూ.61 ప్లాన్, రూ.121 ప్లాన్, రూ.222 ప్లాన్‌లను జియో ప్రవేశపెట్టింది. రూ.15 నుంచి రూ.29 ప్లాన్‌ల వాలిడిటీ మీ ప్రస్తుత ప్లాన్ యాక్టివ్‌గా ఉన్నంత వరకు ఉంటుంది. రూ.15 ప్లాన్‌లో 1 జీబీ.. రూ.19 ప్లాన్‌లో 1.5 జీబీ, రూ.25 ప్లాన్‌లో 2 జీబీ, రూ.29 ప్లాన్‌లో 2.5 జీబీ వస్తుంది.

Also Read: IND vs CAN: భారత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

ఎక్కువ డేటా అవసరమయ్యే యూజర్లకు రూ.61 ప్లాన్ సరైంది. ఇందులో 6 జీబీ డేటా వస్తుంది. యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీ వరకు ఈ డేటా వాడుకోవచ్చు. వీడియోలను స్ట్రీమింగ్ చేయాలనుకుంటే.. రూ.121 ప్లాన్ బెటర్. ఇందులో 12జీబీ డేటా లభిస్తుంది. క్రికెట్ ఫాన్స్ అయితే జియో క్రికెట్ డేటా ప్యాక్‌ రూ.222ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌లో 50 జీబీ హై-స్పీడ్ డేటా వస్తుంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను ఈజీగా వీక్షించవచ్చు.