NTV Telugu Site icon

Sai Durgha Tej: అందుకే పవన్‌ కల్యాణ్‌ మామయ్యను ఎత్తుకున్నా: సాయి తేజ్‌

Sai Dharam Tej Pawan Kalyan

Sai Dharam Tej Pawan Kalyan

Sai Dharam Tej about Pawan Kalyan in Usha Parinayam Pre Release Event: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మంగళగిరిలో హీరో సాయి దుర్గా తేజ్‌ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను హగ్‌ చేసుకుని.. అనంతరం ఎత్తుకున్నారు. ఇందుకు సంబంధిత విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసేనాని విజయం సాధించిన రోజు ఆయన్ను ఎత్తుకోవడంపై సాయి తేజ్‌ తాజాగా స్పందించారు.

‘ఉషా పరియణం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సాయి దుర్గా తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సాయి తేజ్‌ మాట్లాడుతూ… ‘చిన్నప్పుడు నేను ఓ టోర్నమెంట్‌లో ఓడిపోయా. చాలా బాధపడుతూ ఇంటికి వచ్చాను. అప్పుడు పవన్‌ మామయ్య నాతో మాట్లాడాడు. ఒక్కసారే కాదురా పది సార్లు ఓడినా ఫర్వాలేదు కానీ ఆట బాగా ఆడాలని మామయ్య నాతో చెప్పారు. ఆయన ప్రోత్సాహంతో తర్వాత గెలిచాను. నేను గెలిచిన రోజు మామయ్య ఎలా ఆనందించారో.. ఆయన విజయంను నేను అలా ఎంజాయ్‌ చేశా’ అని చెప్పారు.

Also Read: IND Vs SL: రెండో టీ20లో ఘన విజయం.. భారత్‌దే టీ20 సిరీస్‌!

రోడ్డు ప్రమాదం తరవాత ‘విరూపాక్ష’ సినిమాతో సాయి దుర్గ తేజ్ గ్రాండ్‌ కామ్‌బ్యాక్‌ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. విరూపాక్ష తర్వాత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సాయి తేజ్‌ ఓ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఈ మూవీని హనుమాన్ నిర్మాత నిరంజన్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ రాకేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Show comments