NTV Telugu Site icon

Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి సంక్షోబానికి కారణం ఏంటో తెలుసా?

Bengaluru Water Crisis

Bengaluru Water Crisis

Why Bengaluru Dacing a Water Crisis: ప్రస్తుతం బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. అక్కడి వాసులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నీటి వినియోగంపై ఆంక్షలు విధించిందంటే.. అక్కడ పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. స్నానానికి బదులు వైప్స్‌తో తుడుచుకోవడం, వంట సమన్లు ఎక్కువగా కడగకపోవడం, తినడానికి డిస్పీజబుల్ ప్లేట్స్ వాడుతూ.. జనాలు అడ్జస్ట్ అవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ విధంగా ఉందంటే.. ఏప్రిల్, మే నెలల్లో నీటి కష్టాల ఏ రేంజ్‌లో ఉంటాయో అని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు.

నీటి సమస్య కారణంగా పలు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇచ్చేశాయి. దాంతో చాలామంది టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. అక్కడే ఉన్న వారు నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్‌ చేసుకుంటున్నారు. అయితే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ నీటి ధర రూ.600-800 ఉండగా.. ఇప్పుడు రూ.2000 డిమాండ్ చేస్తున్నారట. ఇప్పుడు దేశవ్యాప్తంగా బెంగళూరు నీటి కష్టాలు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ బెంగళూరు నీటి కష్టాలకు కారణాలేంటో ఓసారి చూద్దాం.

Also Read: Navjot Singh Sidhu: టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ సచిన్ కాదు.. అతడే: నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు

బెంగళూరు నీటి సంక్షోబానికి ప్రధాన కారణం తక్కువ వర్షపాతం నమోదవ్వడమే. కర్ణాటకలో గత వర్షాకాలంలో 18% తక్కువ వర్షపాతం నమోదైంది. 2015 నుంచి ఇదే అత్యల్ప వర్షపాతం. దాంతో భగర్బజలాలు ఇంకిపోయాయి. వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో కావేరి నదిలో నీటి మట్టం తగ్గి.. సాగునీటి, తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుతం బెంగళూరు వ్యాప్తంగా ఉన్న సగం బోర్లు ఎండిపోయాయి. ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా మాట్లాడుతూ.. ‘దక్షిణ భారతదేశం చాలా భిన్నమైన జలాశయ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రాతి ఉంటుంది. అందుకే జలాశయాలు ఎక్కువ నీటిని కలిగి ఉండవు’ అని అన్నారు.