NTV Telugu Site icon

Elephants: మన్యంలో ఏనుగుల బీభత్సం.. గుంపులు గుంపులుగా వచ్చి..

Elephants

Elephants

Elephants: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు అలజడి సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి.. బీభత్సం సృష్టిస్తున్నాయి.. కురుపాం మండలంలోని గిరిశిఖర ప్రాంతంలో ఒక గుంపు, జియ్యమ్మవలస, కొమరాడా, గరుగుబిల్లి మండలాలలో ఒక గుంపు గిరిజనులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గరుగుబిల్లి మండలంలోని ఒక ఏనుగుల గుంపు మిల్లులో చొరబడి బీభత్సం సృష్టించిన ఘటన మరువక ముందే కురుపాం మండలం పట్టాయిగూడ గిరిజన గ్రామంలోనికి ఏనుగులు చొరబడటంతో గిరిజనులు భయంతో పరుగులు తీశారు. ఏ క్షణం తమపై ఏనుగులు దాడి చేస్తాయో అని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు.

Read Also: Tamilnadu : తమిళనాడులో ట్రక్కు, కారు ఢీకొని ఐదుగురు ఏపీ విద్యార్థులు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

రెక్కలు ముక్కలు చేసుకుని పండిస్తున్న పంటలను ధ్వంసం చేస్తూ తీరని నష్టాన్ని కలిగిస్తున్న ఏనుగులు ఇప్పుడు జనావాసాల్లోనికి రావడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ఏనుగులను తరలించి తమ పంటలను, ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, మన్యం జిల్లాలో తరచూ ఈ ఏనుగుల గుంపులు వచ్చి పంటలు ధ్వంసం చేస్తూనే ఉన్నాయి.. దీంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. మరోవైపు.. ఏనుగుల కట్టడికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చర్యలు ప్రారంభించారు.. ఈ మధ్యే.. కర్ణాటక వెళ్లి.. ఆయన ఏనుగుల విషయంపై చర్చించిన విషయం విదితమే.