NTV Telugu Site icon

Hepatitis Warning Sign: హెపటైటిస్ వ్యాధి ఎయిడ్స్‌ కంటే ప్రమాదమైంది.. సంకేతాలు ఇవే!

Hepatitis

Hepatitis

Hepatitis Causes and Symptoms: ‘హెపటైటిస్’ చూడటానికి ప్రమాదకర జబ్బుగా కనిపించదు. కానీ ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్లు శరీరంలో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సమయానికి చికిత్స చేయకపోతే.. ఎయిడ్స్‌ కంటే ప్రమాదకరమైనదిగా ఇది నిరూపించబడింది. హెపటైటిస్ కారణంగా చాలా మంది తమ జీవితాలను కోల్పోతారు. హెపటైటిస్ వలన కాలేయం యొక్క వాపు చాలా వరకు పెరుగుతుంది. దీని కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 354 మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.

హెపటైటిస్ ఐదు రకాలు (Hepatitis Types):
హెపటైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. హెపటైటిస్ ఐదు రకాలు (ఎ, బి, సి, డి,ఈ). కలుషిత ఆహారం, నీరు తీసుకున్నపుడు ఈ వైరస్‌లు మనలోకి ప్రవేశిస్థాయి. ఎ,డి,ఈ వస్తే కళ్లు పచ్చగా మారుతాయి. జ్వరం వస్తుంది, బాగా నీరసపడిపోతారు. ఈ ఇన్‌ఫెక్షన్లు రెండు వారాల్లోపే తగ్గిపోతాయి. అయితే గర్భిణులకు హెపటైటిస్‌ వస్తే ప్రమాదకరం. హెపటైటిస్‌ బి, సిలు దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతాయి. దీనితో లివర్‌ క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. హెపటైటీస్‌ బీ, సీ ప్రమాదకరమే అయినా మందులు మాత్రం అందుబాటులో ఉన్నాయి.

హెపటైటిస్ లక్షణాలు (Hepatitis Symptoms):
చర్మం పసుపు రంగులోకి మారడం
కళ్ళు పసుపు రంగులోకి మారడం
గోర్లు పసుపు రంగులోకి మారడం
అలసట
ఫ్లూ లక్షణాలు
ముదురు పసుపు రంగులో మూత్రం
ముదురు పసుపు రంగులో మలం
పొత్తి కడుపు నొప్పి
ఆకలి లేకపోవడం
ఆకస్మికంగా బరువు తగ్గడం

Also Read: Odisha Love Story: అతనికి 76, ఆమెకు 47.. లేటు వయసులో చిగురించిన ఘాటు ప్రేమ!

హెపటైటిస్‌ను ఎలా నివారించాలి? (Hepatitis Remedies):
టీకాలు: హెపటైటిస్‌ను నివారించడానికి ఉత్తమ మార్గం ఒకటి ఉంది. బిడ్డకు చిన్నతనంలోనే దానికి సంబంధించిన అన్ని రకాల టీకాలు వేయించడం. టీకాలు చేయడం ద్వారా హెపటైటిస్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అయితే ఇప్పటివరకు హెపటైటిస్ సి మరియు ఇ వ్యాక్సిన్ టీకాలు కనుగొనబడలేదు.

వైరస్‌కు గురికాకుండా ఉండడం: హెపటైటిస్ వైరస్ సంక్రమణ ఒక వ్యక్తి యొక్క శరీర ద్రవం ఏదో ఒక విధంగా మరొక వ్యక్తికి వెళ్ళినప్పుడు వ్యాపిస్తుంది. అందుకే మీరు ఈ వ్యాధి ఉన్నవారికి దూరంగా ఉండాలి. టూత్ బ్రష్‌ని ఉపయోగించడం, రక్తాన్ని తాకడం మరియు అసురక్షిత శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడం వంటివి చేయొద్దు.

కలుషితమైన నీరు మరియు ఆహారాన్ని నివారించండి: ఇంట్లో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నీరు మరియు ఆహారం తీసుకోండి. తరచుగా బయటి ఫుడ్ తినడం మరియు త్రాగడం ద్వారా హెపటైటిస్ బాధితులుగా మారతారు.

Also Read: Rohit Sharma: ఆ కారణంతోనే టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్నా: రోహిత్ శర్మ

Show comments