Hemant Soren Big Announcement: తన ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రెండు ప్రధాన ప్రకటనలు చేశారు. వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 60 నుండి 50 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు, రాష్ట్రంలో స్థాపించే కంపెనీలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేయబడతాయని సీఎం హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు చేశారు. జార్ఖండ్ దేశంలోనే అత్యంత పేద రాష్ట్రమని, కొవిడ్-19, కరువుతో పోరాడుతున్నామని, అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి గందరగోళం లేదని హేమంత్ సోరెన్ అన్నారు. జార్ఖండ్ వంటి పేద రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేశాయని, మహమ్మారి సమయంలో పేద కార్మికులు రక్షించబడ్డారని, అయితే ఇద్దరు మంత్రులు ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.
Read Also: Lok Sabha Election 2024: ఇండియా కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో గత బీజేపీ పాలనపై జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్, సీఎం హేమంత్ సోరెన్ విరుచుకుపడ్డారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అన్నింటినీ నాశనం చేసిందని.. ఆ సర్కారు హయంలో రైతు మరణించారని ఆయన అన్నారు. తన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. జార్ఖండ్‌ను ఢిల్లీ లేదా రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి కాకుండా గ్రామాల నుంచి పరిపాలిస్తామని అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగమేనన్నారు. స్థానికులకు ఉద్యోగాల వాగ్దానాల రూపురేఖలు ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, పంజాబ్, హర్యానా హైకోర్టు గత నెలలో హర్యానాలో ఇదే విధమైన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. ఈ చట్టం వెనుక ఉన్న నేల పుత్రులు అనే భావన యజమానుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు.