NTV Telugu Site icon

Pune Helicopter Crash: హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్‌లతో సహా ముగ్గురు మృతి..

Pune Helicopter Crash

Pune Helicopter Crash

Pune Helicopter Crash: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పింప్రీ చించ్వాడ్ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం ప్రకారం, హెలికాప్టర్ ఆక్స్‌ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర నుండి బయలుదేరింది. అలా బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.

Prashant Kishor: నేడు పీకే పార్టీ ప్రారంభం.. పార్టీ కీలక అంశాలు, ఎజెండా.?

ఈ ప్రమాదానికి సంబంధించి పింప్రి చించ్‌వాడ్ పోలీసులు మాట్లాడుతూ.., బవ్‌ధాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో ఉదయం 6.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. పూణే జిల్లాలోని బవ్‌ధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయిందని సీనియర్ ఇన్‌స్పెక్టర్ కన్హయ్య థోరట్ తెలిపారు. ఇద్దరు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెలికాప్టర్ అది మంటల్లో ఉండటంతో అందుకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

Show comments