Sonakshi Sinha: అందుకే మనీషా కొయిరాలకు సారీ చెప్పా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heeramandi Star Sonakshi Sinha Says I Love Manisha Koirala: ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాల్లో దురుసుగా ప్రవర్తించినందుకు సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలకు సారీ చెప్పానని బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా తెలిపారు. తనకు మనీషా అంటే ఎంతో ఇష్టం అని, ఆమెతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు. మరోసారి మనీషాతో నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నా అని సోనాక్షి పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సిరీస్‌లో మనీషా, సోనాక్షిలతో పాటు అదితిరావు హైదరి, రిచా చద్ధా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ ఇతర కీలకపాత్రలు పోషించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి సిన్హా హీరామండి సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘నాకు మనీషా కొయిరాల అంటే ఎంతో ఇష్టం. హీరామండి సిరీస్ మొత్తం చూసిన తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పాను. కొన్ని సన్నివేశాల్లో నేను మనీషాతో చాలా దురుసుగా ప్రవర్తించాను. నేను ఆ సీన్స్ ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే ఆమెకు సారీ చెప్పాను. మనీషా గొప్ప నటి. తనతో నటించే వారిని ఎంతో ప్రోత్సహిస్తారు. హీరామండి షూటింగ్ మొత్తం మేం సరదాగా గడిపాం. అంత గొప్ప నటితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మరోసారి మనీషాతో నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అని సోనాక్షి తెలిపారు.
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
Also Read: Hardik Pandya Ban: హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ నిషేధం!
హీరామండి వెబ్ సిరీస్‌లో మల్లికా జాన్ పాత్రలో మనీషా కొయిరాల నటించారు. ఇందులో సోనాక్షి సిన్హా ద్విపాత్రాభినయం చేశారు. రహన, ఫరీదన్ పాత్రలు చేశారు. ముఖ్యంగా నెగెటివ్ ఛాయలున్న ఫరీదన్ పాత్రల్లో నటించి మెప్పించారు. హీరామండితో సోనాక్షి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం సోనాక్షి 2 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకున్నారట. వేశ్యల జీవితాల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించారు.
తాజావార్తలు
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!