Site icon NTV Telugu

Sonakshi Sinha: అందుకే మనీషా కొయిరాలకు సారీ చెప్పా!

Sonakshi Sinha

Sonakshi Sinha

Heeramandi Star Sonakshi Sinha Says I Love Manisha Koirala: ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ వెబ్‌ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాల్లో దురుసుగా ప్రవర్తించినందుకు సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలకు సారీ చెప్పానని బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా తెలిపారు. తనకు మనీషా అంటే ఎంతో ఇష్టం అని, ఆమెతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు. మరోసారి మనీషాతో నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నా అని సోనాక్షి పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సిరీస్‌లో మనీషా, సోనాక్షిలతో పాటు అదితిరావు హైదరి, రిచా చద్ధా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ ఇతర కీలకపాత్రలు పోషించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి సిన్హా హీరామండి సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘నాకు మనీషా కొయిరాల అంటే ఎంతో ఇష్టం. హీరామండి సిరీస్‌ మొత్తం చూసిన తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పాను. కొన్ని సన్నివేశాల్లో నేను మనీషాతో చాలా దురుసుగా ప్రవర్తించాను. నేను ఆ సీన్స్ ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే ఆమెకు సారీ చెప్పాను. మనీషా గొప్ప నటి. తనతో నటించే వారిని ఎంతో ప్రోత్సహిస్తారు. హీరామండి షూటింగ్‌ మొత్తం మేం సరదాగా గడిపాం. అంత గొప్ప నటితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మరోసారి మనీషాతో నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అని సోనాక్షి తెలిపారు.

Also Read: Hardik Pandya Ban: హార్దిక్‌ పాండ్యాపై బీసీసీఐ నిషేధం!

హీరామండి వెబ్‌ సిరీస్‌లో మల్లికా జాన్ పాత్రలో మనీషా కొయిరాల నటించారు. ఇందులో సోనాక్షి సిన్హా ద్విపాత్రాభినయం చేశారు. రహన, ఫరీదన్ పాత్రలు చేశారు. ముఖ్యంగా నెగెటివ్‌ ఛాయలున్న ఫరీదన్ పాత్రల్లో నటించి మెప్పించారు. హీరామండితో సోనాక్షి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం సోనాక్షి 2 కోట్లకు పైనే రెమ్యునరేషన్‌ తీసుకున్నారట. వేశ్యల జీవితాల ఆధారంగా సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించారు.

 

Exit mobile version