NTV Telugu Site icon

Heeng: వంట గదిలో “ఇంగువ”కు ప్రత్యేక స్థానం.. ఉపయోగాలు తెలిస్తే వదలరు..

Hing

Hing

Heeng health benefits: ఇంగువ ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని వంట పదార్థం. ముఖ్యంగా సాంబార్, పప్పుల్లో వీటిని తరుచుగా వాడుతుంటాము. అసఫోటిడా అని పిలిచే ఇంగువ చెట్టు నుంచి వస్తుంది. దీన్ని పౌడర్ గా చేసి వంటల్లో వాడుతుంటారు. భారత దేశంలోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల్లో కూడా ఇంగువను విరివిగా వాడుతుంటారు. దీన్ని దేవతల ఆహారంగా కూడా పిలుస్తుంటారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

శరీరంలో జీర్ణక్రియలను ఇంగువ మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేయడానికి భారతీయ వంటల్లో ఇంగువను వాడుతుంటారు. తీవ్రమైన మైగ్రేన్, పాము కాటు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. శిశువుల్లో గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. 1-2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఇంగువ మిక్స్ చేసి, యాంటీ క్లాక్ వైజ్ గా శిశువు నాభిపై మర్థన చేయడం వల్ల శిశువులు గ్యాస్ నుంచి ఉపశమనం పొందుతారు. పెద్దవారిలో వచ్చే తీవ్రమైన తలనొప్పి మైగ్రెన్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇంగువ కలిపిన నీటిని తాగడం వల్ల మైగ్రెన్ సమస్యను తగ్గించుకోవచ్చు.

శ్వాస కోశ, పంటి సమస్యలకు పరిష్కారం:

ఇంగువకు యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఉన్నాయి. యాంటీ వైరల్ గా పనిచేస్తుంది. ఉబ్బసం, బ్రోన్కైటిస్, పొడి దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. సగం టీ స్పూన్ ఇంగువ పొడి, అల్లం పొడిని 2 టేబుల్ స్పూన్ల తేనెతో కలిపి రోజుకు రెండు మూడుసార్లు తీసుకుంటే శ్వాశకోశ సమస్యలు తీరుతాయి. పంటినొప్పిని తగ్గిస్తుంది. నొప్పి ఉన్న చోట ఇంగువను ఉంచితే నొప్పినుంచి ఉపశమనం అభిస్తుంది.

నపుంసకత్వానికి చికిత్స, పాము కాటుకు విరుగుడు:

పరుషుల్లో నపుంసకత్వానికి చికిత్స చేయడంలో ఇంగువ చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఒక చిటికెడు ఇంగువను నెయ్యిలో వేయించి, ఒక టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ మర్రిచెట్లు నుంచి వచ్చే రబ్బరు పాలతో కలిపి సూర్యోదయానికి ముందు 40 రోజులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. కీటకాలు, పాము కాటుల నుంచి రక్షించే శక్తి ఇంగువకు ఉంది. ఇంగువ పౌడర్ ని నీళ్లలో కలిపి పేస్ట్‌లా చేసి కీటకాలు కాటేసిన స్థలంలో ఉంచాలి. దీంతో కీలకాట విష ప్రభావం తగ్గుతుంది.