Site icon NTV Telugu

Heavy Snow fall: ఉత్తరాదిలో కనిపించని నేల.. మూతపడిన 476రోడ్లు

Snow Fall

Snow Fall

Heavy Snow fall: ఉత్తరాదిలో భారీగా మంచుకురుస్తోంది. దీంతో ఆయా ప్రభావిత రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌, కేదార్‌నాథ్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఇళ్లను, రోడ్లను మంచు కప్పేసింది. అక్కడ రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రత మైనస్‌ 8.3 డిగ్రీల సెల్సియస్‌ కు పడిపోయింది. హిమపాతం దాటికి జాతీయ రహదారులు సహా 476 రోడ్లను అధికారులు మూసివేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోహ్‌తంగ, అటల్‌ సొరంగం వంటిచోట్ల 75 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

Read Also:U19 World Cup: సచిన్ చేతుల మీదుగా అండర్-19 విమెన్స్ టీమ్‌కు సత్కారం

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండోలి, సిమ్లా తదితర ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. నరకంద ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇల్లు, వాహనాలను మంచు కప్పేసింది. అక్కడ రోడ్లుకు ఇరువైపులా భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. హిమాచల్‌లో శుక్రవారం వరకు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తరాఖండ్‌లోని గఢ్‌వాల్‌ ప్రాంతంలోనూ పెద్దఎత్తున మంచు పడుతోంది. జోషీమఠ్‌, బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి తదితర ప్రాంతాలు మంచు దుప్పట్లోనే ఉన్నాయి. కాశ్మీర్ లోయలో ఏ ప్రాంతంలో చూసినా మంచే కనిపిస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సోన్‌మార్గ్, బందీపురాతో పాటూ చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది. గుల్‌మార్గ్, పహల్‌గావ్ పర్యాటక రిసార్ట్‌లు మంచుతో నిండిపోయాయి.

Read Also: Union Budget 2023: రాబోయే పాతికేళ్లు ఎంతో కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Exit mobile version