Heavy Snow fall: ఉత్తరాదిలో కనిపించని నేల.. మూతపడిన 476రోడ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Snow fall: ఉత్తరాదిలో భారీగా మంచుకురుస్తోంది. దీంతో ఆయా ప్రభావిత రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. జమ్ముకశ్మీర్, కేదార్‌నాథ్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఇళ్లను, రోడ్లను మంచు కప్పేసింది. అక్కడ రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 8.3 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. హిమపాతం దాటికి జాతీయ రహదారులు సహా 476 రోడ్లను అధికారులు మూసివేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోహ్‌తంగ, అటల్ సొరంగం వంటిచోట్ల 75 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read Also:U19 World Cup: సచిన్ చేతుల మీదుగా అండర్-19 విమెన్స్ టీమ్‌కు సత్కారం
Also Read
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని మండోలి, సిమ్లా తదితర ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. నరకంద ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇల్లు, వాహనాలను మంచు కప్పేసింది. అక్కడ రోడ్లుకు ఇరువైపులా భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. హిమాచల్‌లో శుక్రవారం వరకు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ ప్రాంతంలోనూ పెద్దఎత్తున మంచు పడుతోంది. జోషీమఠ్, బద్రినాథ్, కేదార్నాథ్, గంగోత్రి తదితర ప్రాంతాలు మంచు దుప్పట్లోనే ఉన్నాయి. కాశ్మీర్ లోయలో ఏ ప్రాంతంలో చూసినా మంచే కనిపిస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సోన్మార్గ్, బందీపురాతో పాటూ చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది. గుల్మార్గ్, పహల్గావ్ పర్యాటక రిసార్ట్లు మంచుతో నిండిపోయాయి.
Read Also: Union Budget 2023: రాబోయే పాతికేళ్లు ఎంతో కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
#WATCH | Himachal Pradesh: Narkanda in Shimla covered in a thick blanket of snow. pic.twitter.com/qtT3AGYZ6d
— ANI (@ANI) January 31, 2023
తాజావార్తలు
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!