తెలంగాణకు హైదరాబాద్ వాతావారణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 158 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్‌లోనూ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచి వాతావరణం చల్లబడుతూ ఉంది.
Read Also: MLA Sanjay: ఇందిరమ్మ ఇళ్లల్లో ఓటు అడిగే హక్కు మాకే ఉంది
భారీ వర్షసూచన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నాడు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జనగాం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సోమవారం కూడా వివిధ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ వారంలో రాష్ట్రంలో వర్షభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.