భారీ వర్షాలతో సంగారెడ్డి అతలాకుతలం అయింది. సంగారెడ్డిలోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరు చేరింది. దీంతో.. సెల్లార్లలో ఉంచిన బైకులు, కార్లు మునిగిపోయాయి. రెవెన్యూ కాలని, ల్యాండ్ అండ్ రికార్డ్స్ కాలనీపై తీవ్ర వరద ప్రభావం ఉంది. దీంతో.. జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. నడుము లోతు నీళ్లలో నిత్యావసరాల కోసం జనం వెళ్తున్నారు. మరోవైపు.. కాలనీలోకి నీళ్లు చేరడంతో ఉద్యోగులు జాబ్ కి సెలవులు పెట్టారు.
Read Also: Pune: ఫుడ్ నిరాకరించారని ట్రక్కు డ్రైవర్ బీభత్సం.. హోటల్, కారు ధ్వంసం
రెవెన్యూ కాలనీ వాసులు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే.. మళ్ళీ వర్షం పడే అవకాశం ఉండటంతో కాలనీ వాసుల్లో ఇండ్ల మునక తప్పదేమోనని భయం నెలకొంది. కాలనీల్లో నీరు చేరడంతో.. జనాలు బయటకు రాలేకపోతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు నీరు లేక కూడా అవస్థలు పడుతున్నారు. ఒక వాటర్ క్యాన్ కోసం కిలోమీటర్ నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. ఇండ్లలోకి వరద రావడంతో ఆఫీస్ వెళ్లలేక పలువురు ఉద్యోగులు లీవ్ పెట్టారు. ఇంకా.. వరదలోనే వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Omar Abdullah: రుబయ్యా సయీద్, IC 814 హైజాక్ విషయంలో మా నాన్నను ఒత్తిడి చేశారు..