భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులకు ఇవాళ( సోమవారం) ఫోన్ లో మాట్లాడారు. ఉత్తర భారత దేశంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల దెబ్బకు రహదారులు తెగిపోయాయి. ఆయా ప్రాంతాలు, గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్ద పెద్ద భవనాలు కూడ పేకమేడలా కూలిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పరిస్థితులపై ప్రధాని మోడీ సీఎంలను అడిగి తెలుసుకున్నారు. వర్ష బాధిత రాష్ట్రాలకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read Also: Andhra Pradesh: అప్రమత్తంగా ఉండండి.. భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం..
రాష్ట్రంలో నిరంతరంగా వర్షాలు కురుస్తున్న కారణంగా కొండ చరియలు విరిగిపడడంతో పాటు రోడ్లు బాగా దెబ్బతిన్నాయని హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రధాని మోడీకి చెప్పారు. భారీ వర్షాలకు 17 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. భారీ వర్షాలకు కోట్లాది రూపాయాల విలువైన ఆస్తులు నీటి పాలయ్యాయి.. భారీ వర్షాలతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం ప్రధాన మంత్రిని కోరారు. ఇవాళ కూడా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ఉత్తర భారతదేశంలో తీవ్ర వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్నాయి. యుమునా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది.
Read Also: Brahmaji: కుక్కతో శోభనం బావుంది.. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..