Site icon NTV Telugu

TG Rains: రాబోయే నాలుగు గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల వారు జాగ్రత్త!

Rains

Rains

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం వణికిపోతోంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. అల్పపీడనం కొనసాగుతున్నందున కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్‌ లో పరిస్థితి మళ్ళీ చాలా దారుణంగా ఉండబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రాబోయే 4 గంటల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Also Read:Kamareddy: వరదలో చిక్కుకున్న 9 మంది.. నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే..

జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్‌లలో కూడా రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కామారెడ్డి గత 36 గంటల్లో 500-600 మిమీ రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. 11 జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరిక.. భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, కొమురంభీం, నిజామాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు, వరదలు.. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

Also Read:Brahmanda : ప్రివ్యూ చూస్తూ డైరెక్టర్ మృతి.. 29న సినిమా రిలీజ్

25 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.. ఉమ్మడి మెదక్ జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు.. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ రోజు మెదక్ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో 32.33 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు.. భారీ వర్షాల నేపథ్యంలో నేడు ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్లు.

Exit mobile version